Monday, December 23, 2024

సింగరేణి కార్మికుని ఆత్మహత్య ..

- Advertisement -
- Advertisement -

యైటింక్లయిన్‌కాలనీ ః సింగరేణి సంస్థ ఆర్‌జి1 ఏరియా 11 ఇంక్లైన్ కాలనీలో పనిచేస్తున్న కార్మికుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే .. శ్రీరాముల వెంకటేశ్వర్లు (40) ఫిట్టర్‌గా పనిచేస్తున్నాడు. మహాకవి పోతనకాలనీలోని 78వ బ్లాక్ 1085 క్వార్టర్‌లో నివాసం ఉంటున్నాడు.

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది క్వార్టర్‌లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటన స్థలాన్ని గోదావరిఖని టూటౌన్ ఎస్‌ఐ కళాధర్‌రెడ్డి సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News