Sunday, December 22, 2024

సింగరేణికే తాడిచెర్ల బొగ్గు బ్లాక్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : సింగరేణిని బలోపేతం చేసేందుకు తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గు గని కేటాయించాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క గురువారం ఢిల్లీలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్ర హ్లాద జోషికి విజ్ఞప్తి చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల రెండవ బ్లాక్ 2 బొగ్గు గని కేటాయింపునకు పూర్తి అనుకూలత ఉందని డిప్యూటీ సిఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డిప్యూటీ సిఎం విజ్ఞప్తి మేరకు కేంద్రమంత్రి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు.

త్వరలో సింగరేణి కాలరీస్కు కేంద్రం నుంచి బొగ్గు గని కేటాయింపునకు సంబంధించిన ముందస్తు అనుమతి లేఖను ఇస్తామన్నారు. తాజా గని కేటాయింపుతో సింగరేణిలో ప్రతి ఏడాది ఐదు మిలియన్ టన్నుల ఉత్పత్తి పెరగనుంది. 30 ఏళ్ల పాటు కొత్త గనిలో తవ్వకాలు జరుపుకునేందుకు అవకాశం ఏర్పడిం ది. తాడిచర్ల బ్లాక్ 2 కొత్తగని ద్వారా 30 ఏళ్ల జీవితకాలంలో 182 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు అవకాశం ఏర్పడింది. సింగరేణికి కేటాయించిన ఒరిస్సా రాష్ట్రంలోని నైనీ బ్లాక్ లోను సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అడ్డంకు లు తొలగించేందుకు ఆ రాష్ట్ర సిఎంతో మాట్లాడాలని కేంద్ర మంత్రిని డిప్యూటి సిఎం కోరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News