Saturday, December 21, 2024

జగన్.. తెలుగు జెండా అంటే ఎట్లా..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జగన్ రెడ్డి… మనం ముందు భారతీయులం తరువాతనే అన్ని అని, దీనిని గుర్తు పెట్టుకుని తీరాలని ప్రముఖ గాయకుడు అద్నాన్ సామి స్పందించారు. భారతీయులు ఎవరూ కూడా ఏ కోణంలో అయినా వేర్పాటువాద వైఖరిని ప్రదర్శించరాదని స్పష్టం చేశారు. దర్శకుడు రాజమౌళి సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటునాటు పాటకు అంతర్జాతీయ స్థాయిలో గోల్డెన్ గ్లోబ్ పురస్కారం పట్ల స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలిపి, తెలుగు జెండా ప్రపంచవ్యాప్త ఖ్యాతితో ఎగురుతోందని, అందరికీ ఆంధ్రప్రదేశ్ తరఫున అభినందనలు తెలియచేస్తున్నానని వ్యాఖ్యానించారు.

దీనిపై అద్నాన్ స్పందిస్తూ తెలుగు జండా అనడం ఏమిటి? ముందు భారతీయ జెండా అని పేర్కొనండి, అంతేకానీ ఇటువంటి వేర్పాటుతత్వపు మాటలకు దిగవద్దని, దేశంలో అంతర్గతంగా మనకు అనేక భేదాభిప్రాయాలు ఉండవచ్చు అని, అయితే అంతర్జాతీయ స్థాయి అంశాలకు వస్తే మనమంతా ఒకే దేశానికి చెందిన వారమని గుర్తుంచుకుని తీరాలని , విభజన ధోరణి పాడికాదు, 1947 జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకోవాలి, ధన్యవాదాలు జైహింద్ అని సామీ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News