Monday, January 20, 2025

130 కిలోల బరువు తగ్గిన సింగర్ అద్నాన్ సామి

- Advertisement -
- Advertisement -

Singer Adnan Sami lost 130 kg

న్యూఢిల్లీ : ప్రముఖ గాయకుడు అద్నాన్ సామి ఏకంగా 130కిలోల మేర బరువు తగ్గారు. కొద్ది రోజులుగా ఆయన ఎవరికి కన్పించకుండా ఉండటం, తన సోషల్ మీడియా అకౌంట్ల స్తంభన వంటి పరిణామాల తరువాత ఆయన ఇప్పుడు చలాకీగా సన్నగా కన్పిస్తూ ఫోటోలు వెలువరించారు. వంద కిలోలకు పైగా బరువు తగ్గడం, స్థూలకాయం లేకుండా చేసుకోవడం అంటే పాట పాడినంత తేలిక కాదు. మాటలు కాదని ఆయన తెలిపారు. తన ఆరోగ్యం గురించి వస్తున్న పలు వదంతులను ఆయన తోసిపుచ్చారు. బరువు తగ్గించుకునేందుకు ఆపరేషన్ చేసుకున్నాడనే వార్తలు వెలువడ్డాయి. అయితే ఇవి నిజం కాదని తెలిపారు. సరైన వ్యాయామం, సముచితమైన ఆహారంతోనే తాను సన్నబడ్డానని తెలిపారు. ఆయన అంతకు ముందు 230 కిలోల బరువు స్థూలకాయంతో ఉండేవారు. ఇది తనకు అనుక్షణ భారం అయిందన్నారు. అయితే ఇప్పుడు 100 కిలోలకు పైగా తగ్గారు. రెండేళ్ల విరామం తరువాత తాను అల్విదా మ్యూజిక్ ఆల్బంతో ఫ్యాన్స్‌ను విస్తుపోయేలా చేస్తానని తెలిపారు. తన సోషల్ మీడియా పోస్టింగ్‌లను తొలిగించలేదని, వీటిని భద్రపర్చినట్లు తరువాత స్పందించనున్నట్లు ట్వీటు వెలువరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News