Friday, April 11, 2025

మహిళా కమిషన్‌లో సింగర్ కల్పన ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని సింగర్ కల్పన మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తనపై దుష్పప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారదను కోరారు. సీనియర్ సింగ్ కల్పన తన ఇంట్లో స్లీపింగ్ పిల్స్ వేసుకుని స్పృహలో లేకపోవడంతో గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఈ నెల 4వతేదీన ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స తీసుకుని బాగుపడిన కల్పన తనపై కొన్ని యూట్యూబ్ చానళ్లు

,సోషల్ మీడియాలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రచారం చేస్తున్నాయని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారదను కలిసి ఫిర్యాదు చేశారు. తన ప్రైవేట్ వీడియోలతో ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్‌పర్సన్‌ను కోరారు. సోషల్ మీడియాలో మహిళలను ట్రోల్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శారద హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News