Wednesday, March 5, 2025

ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

ప్రముఖ గాయని కల్పన నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ఈ ఘటన అనంతరం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కార ణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. హైదరాబాద్‌లోని నిజాంపేట్ వ్ట్రెక్స్ ప్రీవీలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో కల్పన నివసిస్తున్నారు. గత రెండు రోజు లుగా ఇంటి గేట్లు తెరుచుకోకపోవడంతో సెక్యూరిటీ గార్డులకు అనుమానం వచ్చింది. వెంటనే అసోసియేషన్‌కు సమాచారం అందించగా, సభ్యులు ఆమెకు ఫోన్ చేయడానికి ప్రయత్నించారు.

కానీ కల్పన స్పందించకపోవడంతో భర్తకు సమాచారం ఇచ్చారు. కల్పన భర్త చెన్నై నుంచి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అసోసియేషన్ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంటికి చేరుకుని తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను హుటాహుటిన సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కల్పన భర్త తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ చెన్నై నుంచి హైదరాబా ద్‌కు బయలుదేరినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News