హైదరాబాద్: సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు కల్పన తాను ఆత్మహత్యకు పాల్పడ లేదని పోలీసులకు తెలిపారు. తన కూతురితో జరిగిన గొడవ కారణంగా నిద్ర మాత్రలు మోతాదు మించి వేసుకున్నాను అని ఆమె పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో స్ఫష్టం చేసింది. కెపిహెచ్‌బి పోలీసులు దీనిపై ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు.
కల్పన తన భర్తలో కలిసి ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్‌లోని విల్లాలో ఉంటున్నారని.. ఆమె కుమార్తెని కూడా హైదరాబాద్‌కు వచ్చి చదువుకోవాలని కోరగా.. ఆమె అందుకు నిరాకరించిందని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై ఇద్దరికి మనస్పర్ధలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. ఈ బాధతోనే కల్పన మోతాదుకు మించి నిద్ర మాత్రలు వేసుకున్నారని స్ఫష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి ప్రమేయం లేదని కల్పన వెల్లడించారని పేర్కొన్నారు.
కాగా, ఈ విషయంపై కల్పన కుమార్తె కూడా ఉదయం మీడియాతో మాట్లాడారు. తన తల్లి ఆత్మహత్యాయత్నం చేయలేదని.. దయచేసి అవాస్తవాలను ప్రచారం చేయవద్దని ఆమె కోరారు.