Thursday, December 26, 2024

జయం రవి విడాకులతో నాకు సంబంధం లేదు: స్టార్ సింగర్

- Advertisement -
- Advertisement -

ఇటీవల తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 17 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు జయం రవి సోషల్ మీడియాలో సంచలన ప్రకటన చేశారు. తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు వెల్లడించారు. అయితే, తనకు కనీసం చెప్పకుండా విడాకులు తన భర్త విడాకులు ప్రకటించారని జయం రవి భార్య ఆర్తి లేఖ రాశారు. దీనిపై సోషల్ మీడియాలో రకాల రకాల వార్తలు పుట్టుకొచ్చాయి.

స్టార్ సింగర్ కెనీషాతో జయం రవి డేటింగ్ చేస్తున్నాడని.. అందుకే తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు వార్త వైరల్ గా మారింది. దీనిపై తాజాగా ఆ సింగర్ స్పందించింది. ఎక్స్ వేదికగా..’ఆయనకు నాకు మధ్య శారీరక సంబంధం లేదు. మా మధ్య ఉన్నది కేవలం వ్యాపారపరమైన సంబంధమే. ఆయన నాకు మంచి మిత్రుడు. రవి విడాకుల నిర్ణయానికి నేను కారణం కాదు. ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఈ వివాదంలోకి నన్ను లాగొద్దు’ అని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News