Monday, December 23, 2024

ఇంకా ఐసియులోనే లతా మంగేష్కర్..

- Advertisement -
- Advertisement -

ముంబై: కరోనా వైరస్ సోకడంతో నాలుగు రోజుల క్రితం ఇక్కడి బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఐసియులో డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని బుధవారం ఆసుపత్రి వైద్యులు తెలిపారు. 92 సంవత్సరాల లతా మంగేష్కర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గత శనివారం స్వల్ప లక్షణాలతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు వైరస్ స్వల్పంగా సోకిందని, అయితే ఆమె వయసు రీత్యా అనుక్షణం డాక్టర్ల పర్యవేక్షణ అవసరం ఉన్నందున ఐసియులో ఉంచినట్లు లతా మంగేష్కర్ మేనకోడలు రచనా షా తెలిపారు. ఆమె త్వరలోనే కోలుకుంటారని, అయితే ఆమె వయసును పరిగణనలోకి తీసుకుంటే పూర్తిగా కోలుకోవడానికి మరికొంత కాలం పట్టవచ్చని రచన తెలిపారు.

Singer Lata Mangeshkar being treatment for Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News