Monday, December 23, 2024

గాయకుడు మనోకు డాక్టరేట్..

- Advertisement -
- Advertisement -

సంగీత ప్రపంచంలో పరిచయం అక్కర్లేని వ్యక్తి గాయకుడు మనో. తన స్వర మాధూర్యంతో ప్రేక్షకులని రంజింపజేసిన సినీ గాయకుడు మనో కు రిచ్ మండ్ గాబ్రియోల్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. గాయకుడిగా మరియు సంగీత విద్వాంసుడిగా 38 సంవత్సరాల పాటు భారతీయ సంగీత పరిశ్రమలో 15 భారతీయ భాషల్లో 25 వేల పాటలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు ఈ గౌరవం దక్కినట్లు సింగర్ మనో సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లో ఈ విషయాన్ని అభిమానులతో ఆయన పంచుకున్నారు. తనపై ప్రేమ చూపి ఆదరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News