కాచిగూడ: ప్రముఖ గాయనీ నాగరత్నం రేటూరి.. 7భాషల్లో 30గంటల పాటు 336 పాటలను నిర్విరామం గా ఆలపించి, ఆరు వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. త్యాగరాయగానసభలో నాగశ్రీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన నాగరత్నం రేటూరి..30గంటల పాటు ని ర్విరామ సంగీత గీతాలాపాన నిర్వహించి, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్, గోల్డ్ స్టార్ వరల్డ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్డ్, డైమిండ్ వరల్డ్ రికార్డ్, భారత వరల్డ్ రికార్డ్ మొత్తం ఆరు రికార్డ్‌ల కెక్కారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ నటుడు సుమన్ హాజరై వరల్డ్ రికార్డ్‌ల ప్రతినిధులు సమక్షంలో మొత్తం ఆరు రికార్డ్‌లను నాగరత్నంకు అందజేసి ప్రసంగించారు.
నాగశ్రీ సంస్థ నిర్వాహకు రాలు, గా యనీ నాగరత్నం..సాహస ప్రయోగం చేశారని అభినందించారు. తాను ఎంచుకున్న రంగం పట్ల అంకితభావం ఉంటే ఏదైనా సాధిస్తారని ఆయన కొనియాడారు. ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించాలన్నారు. ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందని దానిని తెలుసుకొని ఆ దిశగా ప్రయత్నం సాగించాలన్నారు. మానవ జన్మ ఎంతో గొప్పదని దానిని వృథా చేసుకోవద్దని ఆయన సూచించారు. దేశానికి ఎంతోఈ కార్యక్రమంలో వరల్డ్ రికార్డ్‌ల ప్రతినిధులు బింగి నరేందర్‌గౌడ్, విజయలక్ష్మి, సుభా షిణి, వీనాగు, దేవేందర్ భండారి, రాధ తదితరులు పాల్గొన్నారు.