Monday, December 23, 2024

శివాలయంలో మారేడు మొక్కను నాటిన సినీ గేయ రచయిత శ్యామ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, దుబ్బాక మండలంలోని కూడవెళ్లి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్ ఆలయ ప్రాంగణంలో పరమ శివునికి ప్రీతికరమైన మారేడు మొక్కను ఆలయ ప్రధానార్చకులు, బ్రహ్మా శ్రీ సంకేత శర్మతో కలిసి నాటడం జరిగింది. ఈ సందర్భంగా సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడారు. శివరాత్రి పర్వదినం రోజు కూడవెళ్లి క్షేత్రం లాంటి పురాతణాలయంలో మొక్క నాటడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎంపి సంతోష్ కుమార్ ఆ పరమ శివుని కృపతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ ప్రధాన పూజారి సంకేత శర్మ , ఎంపి సంతోష్ కుమార్ పేరు మీద అర్చన జరిపి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి పూర్ణ, ఆలయ అర్చకులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News