హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో కీలక భూమిక పోషించిన ప్రముఖ గాయకుడు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్(39) గుండెపోటుతో బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండ గ్రామంలోని ఆయన నివాసంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నాగర్ కర్నూల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు హైదరబాద్ గచ్చిబౌలి లోని కేర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే సాయిచంద్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.
తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో ప్రజలను చైతన్యమంతులను చేయడంలో సాయిచంద్ కృషి చేశారు. లక్షలాదిమంది పాల్గొన్న బహిరంగ సభలను ప్రజలను ఆకట్టుకునే విధంగా తన గొంతుకను వినిపించి సభలో పాల్గొన్న వారిని అలరించడంలో సాయి చంద్ ది అందవేసిన గొంతుక అని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తదితరులు పాల్గొనే భారీ బహిరంగ సభలు రాష్ట్రంలో ఎక్కడ నిర్వహించినా ఆయన పాల్గొనేవారు.
Also Read: తెలంగాణలో రెండు కొత్త మండలాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ