Tuesday, December 24, 2024

‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొన్న సింగర్ శ్రీ లలిత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో బాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్ లో ప్రముఖ సింగర్ శ్రీ లలిత శుక్రవారం ఉదయం మొక్కలు నాటింది. ఈ సందర్భంగా శ్రీ లలిత మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రకృతి మనకు తల్లిలాంటిది.. అలాంటి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు. రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని శ్రీ లలిత కోరారు. అనంతరం ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని సింగర్స్ షణ్ముఖ ప్రియ, రమ్య బెహ్రా, రాస్తా రామ్ ముగ్గురికి చాలెంజ్ విసిరారు.

Singer Sri Lalitha plant saplings in Jubilee Hills

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News