Sunday, February 23, 2025

శబరిమలలో ఏసుదాసుకు అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

తన గాత్రంతో కోట్లాది మంది మనసుల్ని ఆనందపరుస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హరివరాసనం అవార్డు గ్రహీత, గాయకుడు కె జె ఏసుదాసు. ముఖ్యంగా అయ్యప్ప స్వామిని ఉద్దేశించి ఏసుదాసు చాలా అద్భుతమైన పాటలు ఆలపించారు. తాజాగా ఆయనకు శబరిమలలో అరుదైన గౌరవం దక్కింది. శుక్రవారం(జనవరి 12) ఏసుదాసు పుట్టినరోజు సందర్భంగా శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ట్రావెన్ కోర్ దేవస్థానం ప్రత్యేక పూజల్ని నిర్వహించింది.

ఉత్తర ఆషాఢం పూజల కోసం ఆలయాన్ని శుక్రవారం ఆలయాన్ని తెరిచారు. ఈ సందర్భంగా అర్చకులు గణపతి హోమం చేశారు. ఏసుదాసు పుట్టిన రోజు కూడా శుక్రవారమే కావటంతో.. ఆయన పేరుపై అయ్యప్పస్వామికి నెయ్యాబిషేకం, సహస్రనామార్చన, ఇతర పూజలు చేసినట్లుగా ట్రావెన్ కోర్ వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఏసుదాసుకు స్వామి వారి తీర్థప్రసాదాల్ని పంపించనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News