Sunday, January 19, 2025

సిఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్ : ఈ నెల 30 న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఉన్నందున అన్ని ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని రాష్ట్ర ఆటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా ఓలీసు కార్యాలయ భవనాలను జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు, జిల్లా అదనపు కలెక్టర్‌లు చాహత్‌భాజ్‌పాయ్, రాజేశంలు, జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్, జడ్పిచైర్‌పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు అత్రం సక్కు, కోనేరు కోనప్పలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ఈ నెల 30 న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఖరారు అయినందున కార్యక్రమం సంబంధిత ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని ఆధికారులను అదేశించారు. రక్షణ, భోజన వసతి, ట్రాఫిక్, త్రాగునీరు తదితర పూర్తిస్థాయి ఏర్పాట్లతో అన్ని శాఖల ఆధికారులు సమన్వయంతో పర్యటనను విజయవంతం చేసే దిశగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అరిగెల నాగేశ్వర్‌రావు, సంబంధిత శాఖల ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News