Friday, December 20, 2024

పాలమూరు పంటను కొనలేని పరిస్థితి ఢిల్లీకి వచ్చింది: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చిన్న జిల్లాలతో అభివృద్ధి వేగవంతం అవుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. పాలమూరులో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పాలమూరులో ఎక్కడ చూసినా ధాన్యపు రాశులు, కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు. డిమాండ్ ఉన్న పంటల సాగును విస్తరించుకోవాలని, పాలమూరు పంటను కొనలేని పరిస్థితి ఢిల్లీకి వచ్చిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకుండా కేసులు వేసి ఆపుతున్నారని దుయ్యబట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల నీటి పంచాయతీని కేంద్రం పరిష్కరించడంలేదని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News