Monday, December 23, 2024

అవి మార్గదర్శకాలు కావు.. మభ్యపెట్టే యత్నాలు

- Advertisement -
- Advertisement -

మన : పంటల రుణమాఫీకి సంబంధించి వ్యవసాయ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి మార్గదర్శకాలు కావు.. మభ్య పెట్టేందుకు ప్రయత్నాలు అని మండిపడ్డారు. రుణమాఫీ మార్గదర్శకాలు అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్ర భుత్వం తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రం లో ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయార ని, ఉమ్మడి రాష్ట్రంలో పడిన రైతుల రుణభారాన్ని తొలగించడం కోసం వ్యవసాయ సుస్థిరత కోసం కెసిఆర్ 2 విడుతల రుణమాఫీ ప్రక్రియకు శ్రీకా రం చుట్టారని తెలిపారు. మొదటి విడుతలో 35. 31 లక్షల మంది రైతులకు రూ. 16,144.10 కో ట్లు, రెండో విడుతలో 22 లక్షల 98 వేల 39 రైతులకు రూ. 13,000.51 కోట్లు రుణమాఫీ చేశారని తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వం అసలు రైతులకు రుణాలే మాఫీ చేయనట్లు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు.

తాము అధికారంలోకి వస్తే ఇలా ఎన్నికలు అయిపోగానే డి సెంబరు 9న రుణమాఫీ చేస్తాం అని కాంగ్రెస్ పా ర్టీ తమ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో ఉన్న 69 లక్షలపై చిలుకు ఉన్న తెలంగాణ రైతాంగంలో ఆశలు రేపిందని అన్నారు. అందరి రుణాలను మాఫీ చేస్తామని ఆ రోజు బహిరంగంగా చెప్పార ని, ఈరోజు కొందరికే పరిమితం చేసేందుకు మా ర్గదర్శకాలు తీసుకువచ్చారని విమర్శించారు. ఈ రోజుల్లో 5 ఎకరాల వ్యవసాయదారుడు, రూ. 30 వేల జీతం చేసే ఉద్యోగి కూడా ట్యాక్స్ పరిధిలోకి వస్తున్నారని, రేషన్ కార్డు, పిఎం డాటా వంటి తో కా తొండాలు పెట్టి కొందరినే రుణమాఫీకి పరిమి తం చేస్తున్నారని పేర్కొన్నారు. రుణమాఫీ చేశాం అన్న ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వ ప్రయత్నాలు తప్ప .. రైతాంగం బాగుండాలి .. వ్యవసాయం బాగుండాలి అన్న సంకల్సం ఈ ప్రభుత్వానికి లేదు అని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు.

రేషన్ కార్డులేని రైతుల పరిస్థితి ఏంటి?
రాష్ట్రంలో రూ.2 లక్షల రుణం పొందిన రైతులు ఎంత మంది ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. పిఎం కిసాన్ డాటాను మార్గదర్శకంగా తీసుకుంటాం అని ఎన్నికల ప్రచారంలో చెప్పలేదని, అసలు దానికి సం బంధించిన షరతులే లోపభూయిష్టం అయినవని పేర్కొన్నారు. తెల్లరేషన్ కార్డు ప్రామాణికం కాదని సిఎం రేవంత్ ఇటీవలే ప్రకటించారని, సరిగ్గా నా లుగు రోజులు తిరగక ముందే నాలుక మడతేశా డు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు కేవలం కుటుంబాలను గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డులను పరిశీలించేవారని తెలిపారు. ప్ర భుత్వ మార్గదర్శకాల ప్రకారం పది ఎకరాలుండి పింక్ కార్డులు ఉన్న రైతులకు రుణమాఫీ వర్తించ దా అని అడిగారు. మరి రేషన్ కార్డులు లేని రైతుల పరిస్థితి ఏంటి..? అని నిరంజన్‌రెడ్డి నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News