భారీగా
పెరిగిన
అమెరికా
విమాన
ఛార్జీలు
గతంలో యూఎస్‌కు సింగిల్ ట్రిప్ ఛార్జి రూ.75వేలు
ఇప్పుడు రూ.2లక్షల పైమాటే రెండితలకు పైగా
పెరగడంతో ప్రయాణికుల గగ్గోలు సీజన్
ఆరంభం కావడంతో పోటెత్తుతున్న విద్యార్థులు
రద్దీకి తగినన్ని ఫ్లైట్లు లేక ఇబ్బందులు
మన తెలంగాణ/హైదరాబాద్ : విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి విమాయాన సంస్థలు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లేందుకు సింగిల్ జర్నీ టికెట్ల ధరల మోత మోగుతోంది. గతంలో రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఉన్న వన్ వే టికెట్ ధర ప్రస్తుతం రూ.2 లక్షలు దాటింది. అమెరికాలో ఉన్న త చదువులు అభ్యసించాలనుకునే విద్యార్థులకు సె ప్టెంబర్ ప్రవేశాలు జరుగుతాయి. అమెరికాలోని వివిధ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఆగస్టులోనే ఆయా విద్యాసంస్థల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జులై, ఆగస్టు నెలల్లో మనదేశం నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటుంది. విద్యార్థు ల రద్దీని ఆసరాగా చేసుకుని విమానయాన సంస్థలు టికెట్ల ధరలు పెంచేశాయి. అయినప్పటికీ విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో విద్యార్థులు అమెరికాకు పోటెత్తినట్లు తరలిపోతున్నారు.
హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఒక్కటే
హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ విమానాశ్ర యం ఉన్నప్పటికీ, ఇక్కడి నుంచి నేరుగా అమెరికా కు వెళ్లే ఫ్లైట్‌లు చాలా తక్కువగా ఉన్నాయి. నేరుగా అమెరికాకు వెళ్లే ఫ్లైట్ ఒక్కటే ఉంది. ఎయిర్ ఇండి యా మాత్రమే హైదరాబాద్ -నుంచి చికాగో వెళ్లే ఫ్లై ట్ నడుపుతోంది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్స్‌ను ఏర్పాటు చేసింది. అలాగే ఖతార్, బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లు ఖతార్, లండన్ మీదుగా విమానాలను నడుపుతున్నాయి. ఇత్తేహాద్ సంస్థ అబుదాబి మీదుగా న్యూయార్క్‌కు నడుపుతోంది. వివిధ దేశాల మీదుగా వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్‌లలో బ్రేక్ జర్నీలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంటుంది. దాంతో చాలామంది విద్యార్థులు ఢిల్లీ, ముంబయి, చెన్నై, కలకత్తా నుంచి అమెరికాకు బయలుదేరుతున్నారు. ఆయా నగరాల నుంచి అమెరికాకు వెళ్లేందుకు టికెట్ ధరలలో పెద్దగా తేడాలు లేకపోయినప్పటికీ నేరుగా అమెరికాకు వెళ్లే ఫ్లైట్ల సంఖ్య కనీసం 20 వరకు ఉంటాయని మారిందని ట్రావెల్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలో నాలుగో పెద్ద విమానాశ్రయంగా ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి నేరుగా అమెరికాకు వెళ్లే విమానాలు తక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు. దాంతో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. డిమాండ్‌కు తగినట్లుగా నేరుగా అమెరికాకు వెళ్లే విమానాల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు.
భారీగా పెరిగిన తెలుగు విద్యార్థులు
ఉన్నత చదవుల కోసం అమెరికా వెళ్లే తెలుగు విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈసారి సుమారుగా 20 వేల నుంచి 30 వేల మంది విద్యార్థులు అమెరికా వెళ్లనున్నట్లు తెలిసింది. అమెరికాలోని వివిధ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు సకాలంలో రిపోర్టింగ్ చేయాల్సి ఉండటంది. దాంతో ఈ సమయంలో అమెరికాకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుండంతో టికెట్లకు డిమాండ్ బాగా పెరిగాయి. దాంతో టికెట్ ధరలు విపరీతంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల రద్ధీకి తగిన విమానాలు లేకపోవడంతో గత్యంతరం లేక ఢిల్లీ, ముంబయి, చెన్నై, కలకత్తా నగరాల నుంచి అమెరికాకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఆయా నగరాల నుంచి అమెరికా వెళ్లే వారికి సింగిల్ ప్లైట్‌లో అనుకూలమైన సీటు లభిస్తుండటంతో ఆయా విమానాశ్రాయాల నుంచి వెళ్లేందుకే విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వెళుతున్న విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే నగరంలో 58 వీసా ప్రాసెసింగ్ కౌంటర్లతో వీసా కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. అయితే వీసా ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ డిమాండ్‌కు తగినట్లుగా అమెరికాకు విమానాలు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.
అమెరికాకు నేరుగా వెళ్లే విమానాల సంఖ్య పెంచాలి : -హరికిషన్, వాల్మీకి ట్రావెల్ అండ్ టూరిజమ్ సొల్యూషన్స్
తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వెళుతున్న వారి సంఖ్యను దృష్టిలో ఉంచుకుని నేరుగా హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లే వినామానాల సంఖ్యను పెంచాలని వాల్మీకి ట్రావెల్స్ అండ్ టూరిజం సొల్యూషన్స్ ఛైర్మన్ హరికిషన్ కోరారు. ఈ విషయంపై తాము కొత కొన్నేళ్లుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. డిమాండ్‌కు తగినన్ని ఫ్లైట్లు అందుబాటులో లేకపోవడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఢిల్లీ, ముంబయి, చెన్నై, కలకత్తా నగరాల నుంచి వెళుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో దేశంలోనే నాలుగో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్లే ఫ్లైట్లు తక్కువగా ఉన్నాయని చెప్పారు. విద్యార్థుల రద్ధీకి తగ్గినట్లుగా నేరుగా అమెరికాకు వెళ్లే విమానాల సంఖ్యను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.