Saturday, February 1, 2025

సింగిల్ ఫేజ్‌కు 2కిలోవాట్లు

- Advertisement -
- Advertisement -

ఐసిఎస్‌సిలకు డిస్కంల ఆదేశాలు విద్యుత్ లోడ్
సామర్థాల్లో మార్పులు హైదరాబాద్, వరంగల్‌లో
తొలుత కొత్త విధానం అమలు పెరగనున్న రుసుం

మన తెలంగాణ/హైదరాబాద్: గృ హ, వాణిజ్య కనీస లోడ్ సామర్థ్యాన్ని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎన్‌పీడీసీఎల్)లు పెంచాయి. ఆ ప్రకారం రుసుం మొత్తం కూడా పెరిగినట్లయింది. ఈ మేరకు విద్యు త్తు పంపిణీ సంస్థలు సమీకృత వినియోగదారుల సేవా కేంద్రాల(ఐసీఎస్‌సీ)కు ఇటీవల ఆదేశాలు వెలువరించాయి. తాజా ఆదేశాల ప్రకారం సిం గిల్ ఫేజ్‌లో గృహ విద్యుత్తు కనెక్షన్ కావాలనుకునే వారు ఇక నుంచి ఒక కిలోవాట్‌కు బదులుగా 2 కిలోవాట్లకు దరఖాస్తు చేసుకోవాల్సిందే. త్రి ఫేజ్ గృహ, వాణిజ్య కనెక్షన్లకు కనీ సం 5 కిలోవాట్లకు దరఖాస్తు చేసుకుంటేనే మంజూరు చేస్తారు. హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో తొలుత ఈ విధాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సింగిల్ ఫేజ్‌లో కిలోవాట్ గృహ కనెక్షన్‌కు ఇదివరకు డిపాజిట్, ఛార్జీలు, దరఖాస్తు రుసుం కలిపి రూ.1,425 చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు 2 కిలోవాట్లకు

రూ.2,825 చెల్లించాల్సి ఉం టుంది. త్రిఫేజ్‌లో గృహాలకు 5 కిలోవాట్ల కనెక్షన్‌కు రూ.7,025 చెల్లించాలి. ఇదివరకు 3 కిలోవాట్లకు రూ. 4,225 చెల్లించేవారు. వాణిజ్య కనెక్షన్లకు సంబంధించి సింగిల్ ఫేజ్‌లో రెండు కిలోవాట్లకు రూ.4,045 చె ల్లించాలి. త్రిఫేజ్‌లో కనీసం 5 కిలోవాట్లకు రూ.10,050 చెల్లించాలి. రిజిస్టర్ డాక్యుమెంట్లతో పోలిస్తే నోటరీ డాక్యుమెంట్లకు అదనంగా ఛార్జీలు తీసుకుంటున్నారు. గృహాలకు సింగిల్ ఫేజ్ కోసం 2 కిలోవాట్ల కనెక్షన్‌కు రూ.3,625, త్రీఫేజ్ 5 కిలోవాట్లకు రూ.9,025 చెల్లించాలి. వాణిజ్య కనెక్షన్లకు సింగిల్ ఫేజ్ 2 కిలోవాట్లకు రూ.7,250, త్రిఫేజ్ ఐదు కిలోవాట్లకు రూ.18,050 కట్టాల్సి ఉంటుంది. డిపాజిట్, ఛార్జీల మొత్తాన్ని పెంచలేదని, విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉన్నందున లోడ్‌ను మాత్రమే పెంచామని విద్యుత్తు శాఖ అధికారులు చెబుతున్నారు. చాలామంది ఒక కిలోవాట్ కనెక్షన్ తీసుకుని 2.5 కిలోవాట్ల లోడ్ వరకు వాడుతున్నారని, దీంతో వేసవిలో సమస్యలు ఎదురవుతున్నాయంటున్నారు. ఇలాంటి కనెక్షన్లను రికార్డెడ్ మాగ్జిమమ్ డిమాండ్ (ఆర్‌ఎండీ) ఆధారంగా లోడ్‌ను క్రమబద్ధీకరించుకోవాలని వినియోగదారులకు సూచిస్తున్నామని పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News