Friday, December 20, 2024

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేత

- Advertisement -
- Advertisement -

సినిమా ప్రియులకు షాకింగ్ న్యూస్.. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడనున్నాయి. ఆక్యుపెన్సీ తక్కువ ఉండటంతో రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమాన్యాలు తాత్కాలిక విరామం ప్రకటించాయి. దీంతో శుక్రవారం నుంచి 10 రోజుల పాటు షోలు వేయవద్దని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. కొత్త సినిమాలు లేక ధియేటర్లు నడపడం చాలా కష్టంగా ఉందని ధియేటర్ల యజమానులు తెలిపారు.

ఎన్నికలు, ఐపిఎల్ కారణంగా ఇటీవల పెద్ద సినిమాలు విడుదల కాకపోవడంతో సినిమా హాళ్లకు వచ్చేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.దీంతో సినిమాళ్లు వెలవెలబోతున్నాయి. ఈక్రమంలో హైదరాబాద్ సిటీ మినహా..మిగతా ప్రాంతాల్లో సింగల్ స్క్రీన్ ధియేటర్లను బంద్ చేయాలని నిర్ణయించినట్లు యజమానులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News