Wednesday, January 22, 2025

నిత్య జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించాలి

- Advertisement -
- Advertisement -

వీడియో సందేశంలో కొండా సురేఖ

మన తెలంగాణ / హైదరాబాద్ : పచ్చదనం పెంపునకు ఎంతగా ప్రాధాన్యతను ఇస్తున్నామో, నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని అటవీ పర్యవరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని, అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో మన పరిసరాలు, గాలి, నీరు కలుషితం అవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ శుక్రవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అని ఆమె తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు, ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగం తగ్గింపును విధిగా చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపు నిచ్చారు. తన సెక్రటేరియట్ కార్యాలయంతో పాటు, నివాసంలోనూ వీలైనంతగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించేందుకు నిర్ణయించామన్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ బదులుగా గ్లాస్ బాటిల్స్ లేదంటే స్టీల్ వస్తువుల వాడకాన్ని పెంచాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News