Sunday, January 19, 2025

Miss World 2024: బ్లాక్ గౌనులో సిని శెట్టి అదుర్స్!

- Advertisement -
- Advertisement -

అందాల సుందరి, ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ విజేత సిని శెట్టి మరో ఘనత సాధించింది. ప్రస్తుతం మిస్ వరల్డ్ 2024 పోటీల్లో పాల్గొంటూ బిజీబిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆసియా-ఓషియానా ప్రాంతంనుంచి టాప్ 5కు చేరుకుంది. అలాగే మొత్తంమీద టాప్ 20లో చోటు సంపాదించుకుంది. మిస్ వరల్డ్ 2024పోటీల్లో భాగంగా శనివారం టాప్ మోడల్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ పోటీలకు పొడవైన నల్లటి గౌను ధరించి పాల్గొన్న సిని శెట్టి చూపరులను కట్టిపడేసింది. ఆసియా-ఓషియానా కేటగిరిలో బెస్ట్ డిజైనర్ డ్రెస్ అవార్డును కూడా సిని శెట్టి గెలుచుకుంది. ఈ పోటీకి సంబంధించిన ఫోటోలను సిని శెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అవి తెగ వైరల్ అవుతున్నాయి.

ఫిబ్రవరి 18న మొదలైన మిస్ వరల్డ్ పోటీలు మార్చి 9తో ముగుస్తాయి. ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే ఫైనల్ ఈవెంట్ లో గెలిచిన విజేతకు మిస్ వరల్డ్ 2021 విజేత, పొలెండ్ కు చెందిన కరోలినా బీలావ్ స్కా అందాల కిరీటాన్ని అలంకరిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News