కీస్, షెల్టన్ ముందుకు..
ఆస్ట్రేలియా ఓపెన్
ఇగా అలవోకగా..
మహిళల సింగిల్స్‌లో అగ్రశ్రేణి క్రీడాకారిణి స్వియాటెక్ అలవోక విజయంతో సెమీస్‌కు చేరుకుంది. అమెరికాకు చెందిన ఎమ్మా నవారొతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 31, 62తో సునాయాస విజయం సాధించింది. ఆరంభం నుంచే ఇగా దూకుడుగా ఆడింది. ఆమె ధాటికి ఎమ్మా ఎదురు నిలువలేక పోయింది. పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఇగా ఎలాం టి ప్రతిఘటన లేకుండానే మొదటి సెట్‌ను దక్కించుకుంది.
రెండో సెట్‌లో కూడా ఇగా ఆధిపత్యం చెలాయించిం ది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుని ముందం జ వేసింది. మరో పోటీలో కీస్ చెమటోడ్చి విజయం సాధించింది. ఎలినా స్విటోలినా (ఉక్రెయిన్)తో జరిగిన పో రులో కీస్ 36, 63, 64తో జయకేతనం ఎగుర వేసింది. తొలి సెట్‌లో స్విటోలినా ఆధిపత్యం చెలాయించిం ది. దూకుడుగా ఆడుతూ అలవోకగా సెట్‌ను సొంతం చేసుకుంది. కానీ త ర్వాత కీస్ పుంజుకుంది. అద్భుత ఆట తో స్విటోలినాను హడలెత్తించింది. ఈ క్రమంలో వరుసగా రెండు సెట్లు గెలిచి సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకుంది.
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ జన్నిక్ సిన్నర్ (ఇటలీ) పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అమెరికాకు చెందిన 21వ సీడ్ బెన్ షెల్టన్ కూడా క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించి ముందంజ వేశాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్) సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అమెరికా క్రీడాకారిణి మాడిసన్ కీస్ కూడా క్వార్టర్ ఫైనల్ పోరులో జయభేరి మోగించింది. బుధవారం 8వ సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సిన్నర్ అలవోక విజయాన్ని అందుకున్నాడు. పూర్తి ఆధిపత్యం చెలాయించిన సిన్నర్ 63, 62, 61తో మినార్‌ను మట్టికరిపించాడు. ఆరంభం నుంచే సిన్నర్ దూకుడును ప్రదర్శించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగాడు.
కళ్లు చెదిరే షాట్లతో విరుచుకు పడిన సిన్నర్ ఏ దశలోనూ మినార్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఇదే క్రమంలో వరుసగా మూ డు సెట్లు గెలిచి సెమీస్‌కు చేరుకున్నాడు. ఉత్కంఠభరితంగా సాగిన మరో క్వార్టర్ ఫైనల్లో షెల్టన్ జయకేతనం ఎగుర వేశాడు. ఇటలీ ఆటగాడు సొనెగోతో జరిగిన హోరాహోరీ సమరంలో షెల్టన్ 64, 75, 46, 76తో విజయం సాధించాడు. ప్రా రంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇటు షెల్టన్ అటు సొనెగో సర్వం ఒడ్డి పోరాడారు. దీంతో పోటీలో ఉత్కంఠ తప్పలేదు. కానీ షెల్టన్ నిలకడైన ఆటను కనబరుస్తూ తొలి రెండు సెట్లను కైవసం చేసుకున్నాడు. మూడో సెట్‌లో సొనెగో పైచేయి సాధించాడు. కానీ నాలుగో సెట్ లో మళ్లీ షెల్టన్ విజృంభించాడు. టైబ్రేకర్ వరకు సాగిన సెట్‌లో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లాడు.