Tuesday, January 21, 2025

పాప పుణ్యాలే… వారి కర్మఫలాలు

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట: పుణ్యం చేసుకున్న వారికి పుణ్యం, పాపం చేసిన వారికి పాపం వారు చేసుకున్న కర్మ ఫలాలను బట్టే భవిష్యత్తు ఉంటుందని అనురాధ సోమవారం తన భవిష్యవాణి వినిపించారు. ధర్మం, న్యాయంతో నడిచే వారికి అంతా మేలే జరుగుతుందన్నారు. దారి తప్పిన వారిని సైతం కాపాడుతానని, అది నాబాధ్యతన్నారు. హరిబౌలి శ్రీ అక్కన్నమాదన్న మహంకాళి మందిరం, లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిణి మహంకాళి ఆలయం వద్ద సోమవారం జరిగిన రంగ (భవిష్యవాణి) కార్యక్రమంలో పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపిస్తూ మంచీ, చెడు అంతా మీరు నడిచే ధర్మం, పాటించే న్యాయంపై ఆధారపడి ఉంటాయన్నారు.

ఉమ్మడి రాష్ట్రాలలో వర్షాలు కురిపిస్తానని, కష్టపడి చదువుతున్న నిరుద్యోగులకు ఫలితం లభిస్తుందన్నారు. మీర్‌ఆలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో మాతాంగి స్వర్ణలత తన భవిష్యవాణి వినిపించారు. మహిళలపై పెరుగుతున్న గృహహింసలు, యువకులు చెడు వ్యసనాలకు బానిసకావటంపై ఆందళోన వ్యక్తం చేస్తూ అందరిని నేను చూసుకుంటానన్నారు. మహంకాళేశ్వర ఆలయంలో గత 25రోజులుగా చేస్తున్న పూజల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు వారు ఆయా ఆలయాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మాతంగిలు అనురాధను, స్వర్ణలతను ఆలయ ఆచారాలు, సాంప్రదాయం ప్రకారం ఘనంగా సన్మానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News