- Advertisement -
హైదరాబాద్: టీమ్ ఇండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్ టోలిచౌకి ఆర్‌డిఒ ఆఫీస్‌లో సందడి చేశారు. రేంజ్ రోవర్ కారు నంబర్ కోసం ఆయన ఆర్‌డిఒ ఆఫీస్‌కు వచ్చినట్టు సమాచారం. సిరాజ్‌తో ఫొటోలు దిగేందుకు క్రికెట్ అభిమానులు పోటీపడ్డారు. ఆర్‌డిఒ కార్యాలయంలో తన పని త్వరగా పూర్తి చేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో సిరాజ్ బౌలర్ గా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ తో జరిగే టి 20 సిరీస్ కు సిరాజ్ ను ఎంపిక చేయలేదు.
- Advertisement -