Monday, January 20, 2025

అద్భుతమైన క్యాచ్ పట్టిన సిరాజ్… వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

డొమినికా: విడ్సోర్ పార్క్‌లో భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విండీస్ 64.3 ఓవర్లలో 150 పరుగులు చేసి ఆలౌటైంది. సిరాజ్ మాత్ర సూపర్ క్యాచ్ పట్టాడు. 28 ఓవర్‌లో జడేజా బౌలింగ్‌లో బ్లాక్‌వుడ్ బంతిని పైకి లేపాడు. లాంగ్ మిడాఫ్‌లో ఉన్న సిరాజ్ పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని అద్భుతంగా పట్టుకున్నాడు. ఈ క్యాచ్ పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అతి వేగంగా వచ్చి ఎలా బంతి పట్టి ఉంటాడా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సిరాజ్ కిందపడినప్పుడు మోతి చేతికి గాయమైంది. కాసేపట్లోనే కోలుకున్నాడు. ఆ తరువాత బౌలింగ్ చేసి హోల్డర్ వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ ఐదు వికెట్లు తీయగా జడేజా మూడు వికెట్లు, సిరాజ్, టాకూర్ చెరో ఒక వికెట్ తీశారు. వెంటనే బ్యాటింగ్ చేసిన 23 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా 80 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం విండీస్ 70 పరుగుల ఆధిక్యంలో ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News