Thursday, December 12, 2024

ఆటలో ఇలాంటివి సహజమే

- Advertisement -
- Advertisement -

భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి
ముంబై: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ఆ స్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ పట్ల టీమిండి యా ఫాస్ట్ బౌలర్ సిరాజ్ ప్రవర్తించిన తీరుపై సర్వ త్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. సిరా జ్ తీరును భారత్‌తో పాటు మాజీ విదేశీ క్రికెటర్లు తీవ్రంగా తప్పుపట్టారు. అయితే భారత మాజీ ప్ర ధాన కోచ్ రవిశాస్త్రి మాత్రం సిరాజ్‌కు అండగా ని లిచాడు. హెడ్‌పై సిరాజ్ ప్రవర్తించిన తీరును తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నాడు.

ఏ ఫాస్ట్ బౌలర్‌కై నా ఇలాంటి టెంపర్‌మెంట్ సహాజమన్నాడు. తా ము ఆడే రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు తరచు జరిగేవన్నాడు. దీన్ని అప్పట్లో ఎవరూ పెద్ద గా పట్టించుకునే వారు కాదన్నాడు. సిరాజ్ పెద్ద తప్పు ఏమీ చేయలేదన్నాడు. ఫాస్ట్ బౌలర్లు ఇలా ప్రవర్తించడం ఆటలో భాగమేనన్నాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగే మిగిలిన టెస్టుల్లో ఇలాంటి సంఘటనలు మరిన్ని తలెత్తడం ఖాయమన్నాడు. మరోవైపు ఇకపై జరిగే మ్యాచుల్లో భారత క్రికెటర్లు మైదానంలో మరింత దూకుడుగా ఉండాలన్నాడు. కసితో ముందుకు సాగాలన్నాడు. ఆస్ట్రేలియా ఆ టగాళ్ల సవాళ్లకు దీ టుగా బదులి వ్వాలన్నాడు. అప్పుడే జట్టుకు గెలు పు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News