Wednesday, January 29, 2025

తెలంగాణ వాసులకు విముక్తి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దుబాయ్ లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు విముక్తి లభించింది. హత్య కేసులో 18 ఏళ్లుగా దుబాయ్ లో సిరిసిల్ల వాసులకు జైలు శిక్ష పడింది. నేపాల్ కు చెందిన వాచ్ మెన్ బహదూర్ సింగ్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. దుబాయ్ కోర్టు తొలుత పదేళ్లు.. ఆ తర్వాత 25 ఏళ్లకు జైలు శిక్ష పెంచింది. నేపాల్ వెళ్లి హతుని కుటుంబసభ్యులకు కెటిఆర్ రూ.15 లక్షల పరిహారం ఇచ్చారు.

స్వయంగా డబ్బులు చెల్లించి క్షమాబిక్ష పత్రం రాయించారు కెటిఆర్. మారిన నిబంధనలతో ఖైదీల విడుదల కు దుబాయ్ కోర్టు అంగీకరించింది. విడుదలకు న్యాయవాదులు అనారోగ్యకారణాలు చూపుతూ మరోసారి ప్రయత్నించారు. అనారోగ్య కారణాలు అంగీకరించి ఏడేళ్లు ముందే దుబాయ్ కోర్టు విడుదల చేసింది. దుబాయ్ నుంచి సిరిసిల్ల, రుద్రంగి, కొనరావుపేట వాసులు వచ్చేశారు. 18 ఏళ్ల తర్వాత కుటుంబసభ్యులను కలుసుకోవడంతో భావోద్వేగానికి లోనయ్యారు. కెటిఆర్ చొరవతోనే దుబాయ్ నుంచి వచ్చామని బాధితులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News