Thursday, January 23, 2025

ఉత్తమ జిల్లా పరిషత్ సిరిసిల్ల

- Advertisement -
- Advertisement -

Sirisilla as the best Zilla Parishad: Azad ka Amrit Mahotsav

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల జిల్లా, మండల, గ్రామ పంచాయతీల స్థాయిల్లో రాష్ట్రానికి 19 అవార్డులు అజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా పురస్కరాల పంట

మన తెలంగాణ/హైదరాబాద్ : జాతీయ స్థాయిల్లో రాష్ట్రానికి మరోసారి అవార్డుల పంట పండింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా, మండల, గ్రామ పంచాయతీల స్థాయిలో మొత్తం 19 అవార్డులను సొంతం చేసుకుంది. ప్రతి ఏటా ఇచ్చే అవార్డులలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈసారి ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో అవార్డులను శనివారం ప్రకటించింది.

ఇందులో ఉత్తమ జిల్లా పరిషత్‌గా సిరిసిల్లాను ఎంపిక చేసింది. కాగా ఉత్తమ మండలాలుగా వరంగల్ జిల్లా పర్వత గిరి, పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాలోని తిరుమల గిరి, జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల్ మండలాలకు అవార్డులను ప్రకటించింది. అలాగే ఉత్తమ పంచాయతీలుగా సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామం, ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్రకే గ్రామం, కరీంనగర్ జిల్లాలోని వెల్జాల, మహబూబాబాద్ జిల్లాలోని వెంకటాపూర్, సిద్దిపేట జిల్లా జక్కా పూర్, బూరుగు పల్లి, మహబూబ్ నగర్ జిల్లా గుండ్ల పోట్ల పల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా మద్దికుంట, మండే పల్లి, వరంగల్ జిల్లాలోని మరియపురం, పెద్దపల్లి జిల్లాలోని నాగారం, హరిపురం, నారాయణపేట జిల్లాలోని మంతన్‌గడ్, వనపర్తి జిల్లాలోని చందాపూర్ గ్రామలు కూడా అవార్డులను సొంతం చేసుకున్నాయి.

కెసిఆర్ విజన్‌తోనే అవార్డులు

రాష్ట్రానికి అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దూరదృష్టి, అభివృద్ధి విజన్ కారణంగానే ఈ అవార్డులు దక్కాయని వ్యాఖ్యానించారు. ఇందుకు సిఎం కెసిఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు… ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే అవార్డులను ప్రకటించినందుకు కేంద్రానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News