Wednesday, December 25, 2024

సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -
  • అటవీ శాఖ మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

కాగజ్‌నగర్/సిర్పూర్‌టి/కౌటాల/చింతలమానేపల్లి: జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధ్దికి అధిక ప్రాధాన్యత నివ్వడం జరుగుతుందని రాష్ట్ర ఆటవీ, పర్యావరణ, న్యాయ, శాస్త్ర సాంకేతిక, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సిర్పూర్ నియోజకవర్గ పరిధిలో తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు, ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధ్ది చేసే విధంగా ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధ్ది పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గంలోని అచ్చేల్లి, చింతకుంట వంతెన, శివపూర్, హిరాపూర్ వంతెన ప్రారంభించడం జరిగిందని, శివపూర్, హీరాపూర్ రోడ్లకు భూమిపూజ, పాతట్లగూడ వంతెన ప్రారంభించడం జరిగిందని, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

మన్నేవార్ సంఘం భవనానికి భూమిపూజ చేయడం జరిగిందని తెలిపారు. కౌటాల మండలంలోని మోగడ్‌దగడ్, వైగాం రోడ్లకు భూమిపూజ, వార్దా నదిపై 75 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న గుండాయిపేట్, నందివర్దా మద్య హైలెవల్ అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణానికి భూమిపూజ, చింతలమానేపల్లి మండల కేంద్రంలో 133 కేవి సబ్‌స్టేషన్‌కు భూమిపూజ, చింతల్‌పాటి, గురుడ్‌పేట్ రోడ్డుకు, చింతలమానేపల్లి గంగాపూర్ రోడ్డుకు, చింతలమానేపల్లి గంగాపూర్ రోడ్డుకు, కర్జేల్లి బారేగూడ రోడ్డుకు భూమిపూజ, దిందాలో లో లెవల్ వంతెన నిర్మాణానికి భూమిపూజ చేయడం జరిగిందని తెలిపారు.

ప్రజల సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ది కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి నెల 4 వెల 16 రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుందని, మహిళా సంక్షేమం కోసం ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు గర్భీణిలకు సకాలంలో సరైన పోషకాహారం అందించేందుకు న్యూట్రిషన్ కిట్, ప్రసవం తరువాత బాలింతలకు కేసిఅర్ కిట్ అందించడం జరుగుతుందని తెలిపారు.

వెనుకబడిన తరగతులు, మైనార్టీల కొరకు లక్ష రూపాయల అర్థిక సహాయం పథకాన్ని అందించడం జరుగుతుందని, గృహలక్ష్మి పథకం ద్వారా సొంత ఇంటి స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకునే అర్థిక స్థోమత లేనివారికి 3 లక్షల రూపాయల అర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇలా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభ్యున్నతికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News