Monday, December 23, 2024

దిశ ఎన్‌కౌంటర్ కేసు.. విచారణ పూర్తి చేసిన సిర్పూర్కర్ కమిషన్

- Advertisement -
- Advertisement -
Sirpurkar commission completes inquiry into Disha encounter
విచారణ పూర్తి చేసిన సిర్పూర్కర్ కమిషన్.. సుప్రీంకోర్టుకు చేరిన నివేదిక

హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఏర్పాటైన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణను పూర్తి చేసింది. విచారణకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. సిర్పూర్కర్ కమిషన్ ఈ నెల 28న సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. 2019 నవంబర్‌లో షాద్‌నగర్ శివారులో జరిగిన దిశ అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులు ఉన్న నలుగురిని డిసెంబర్ 6 తెల్లవారు జామున సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం పోలీసులు చటాన్పల్లి బ్రిడ్జి దగ్గరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నిందితులు మరణించారు.

దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ త్రిసభ్య కమిషన్‌ను వేసిన సంగతి విదితమే. ఈ కమిషన్ చైర్మన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ సిర్పూర్కర్‌ను నియమించింది. ఈ కమిషన్ 47 రోజుల పాటు ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగింది. ఫోరెన్సిక్ నివేదికలు, డాక్యుమెంట్ రికార్డ్, పోలీసు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, పోస్ట్‌మార్టం రిపోర్ట్, సీన్ ఆఫ్ అఫెన్స్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కమిషన్ సభ్యులు సేకరించారు. అడ్వకేట్స్, ఎన్‌కౌంటర్లో పాల్గొన్న పోలీసులు, మాజీ సైబరాబాద్ సిపి సజ్జనార్, దిశ కుటుంబ సభ్యులు, ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన కుటుంబ సభ్యులన కమిషన్ కలిసి విచారణ చేపట్టింది. తాజాగా విచారణ పూర్తి చేసి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News