Sunday, December 22, 2024

సిసోడియాను సిబిఐ చిత్రహింసలకు గురిచేస్తోంది: ఆప్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియాను సిబిఐ చిత్రహింసలకు గురిచేస్తోందని, తప్పుడు ఆరోపణలతో కూడిన పత్రాలపై సంతకం చేయాలని ఒత్తిడి తెస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆదివారం ఆరోపించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు దర్యాప్తులో సహకరించడంలేదని, పరిశోధకుల ప్రశ్నల నుంచి తప్పించుకున్నందుకు ఫెడరల్ ఏజెన్సీ ఫిబ్రవరి 26న సిసోడియాను అరెస్టు చేసింది. కాగా సిబిఐ ప్రత్యేక కోర్టు శనివారం సిసోడియా కస్టడీని మార్చి 6 వరకు పొడిగించింది. ఫిబ్రవరి 28న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని మంత్రివర్గంకు సిసోడియా రాజీనామా చేశారు.

ఇంత వరకు ఎలాంటి కీలక ఆధారాలు సేకరించని సిబిఐ సిసోడియా కస్టడీని మరిన్ని రోజులు కోరుకుంటోంది. తప్పుడు డాక్యుమెంట్ల మీద సంతకాలు పెట్టాలని ఒత్తిడి తెస్తోందని సమాచారం. సిసోడియా విషయంలో సిబిఐ దగ్గర ఎలాంటి ఆధారం లేకపోయినప్పటికీ అతడిని అరెస్టు చేసిందని ఓ వాదన. ఐదు రోజుల కస్టడీ గడువు ముగియడంతో అతడిని కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కస్టడీలో రోజు ఎనిమిది తొమ్మిది గంటలు, అడిగిందే అడిగి మానసిక వ్యథకు అతడిని గురిచేశారని సమాచారం.

సిసోడియా కేసును విచారించిన న్యాయమూర్తి ఆయనపై ఎలాంటి థర్డ్ డిగ్రీ ఉపయోగించరాదని దర్యాప్తు సంస్థను ఇదివరకే ఆదేశించారు. అడిగిన ప్రశ్నలనే అడుగరాదన్నారు. ‘కొత్తది ఏదైనా ఉంటే మీరడగండి’ అని మాత్రమే అనుమతించారు. కానీ జరుగుతున్నది వేరని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News