Thursday, January 23, 2025

సిబిఐ కస్టడీకి సిసోడియా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఢిల్లీ ప్రత్యేక కోర్టు సోమవారం ఐదురోజుల సిబిఐ కస్టడీకి అనుమతినిచ్చింది. ఈమేరకు సిసోడియా ఇప్పుడు మా ర్చి 4వ తేదీ వరకూ సిబిఐ కస్టడీలోకి వెళ్లి, ఇంటరాగేషన్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్కామ్‌లో ఒక్కరోజు క్రితం సిసోడియాను సిబిఐ ఏకంగా 8 గంటల పాటు విచారించింది. పలు ప్రశ్నలకు ఆ యన సరిగ్గా స్పందించడం లేదని పేర్కొంటూ అ దుపులోకి తీసుకుంది. సోమవారం ఉదయం స్థాని క ఢిల్లీ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నా గ్‌పాల్ ఎదుట భారీ బందోబస్తు నడుమ సిసోడియాను హాజరుపర్చారు. అంతకుముందు ఢిల్లీ, పంజాబ్, ముంబైలలోని ఆప్ కార్యాలయం వద్ద కార్యకర్తల నిరసన ప్రదర్శనలు జరిగాయి. కోర్టులో సిసోడియాను హాజరుపర్చిన తరువాత సిబిఐ, సిసోడియా తరఫు న్యాయవాదులు తమతమ వాదనలు విన్పించారు. అప్పుడు కోర్టు తమ తీర్పును రిజర్వ్ చేసి తరువాత వెలువరించింది.

సిసోడియాకు ఐదురోజుల సిబిఐ కస్టడీకి అనుమతిని వెలువరించింది. తమ ఇంతకు ముందటి విచారణకు సిసోడియా సరిగ్గా సహకరించకపోవడంతో ఆయన సమర్థవంతమైన ఇంటరాగేషన్‌కు వీలు కల్పించాలని అంతకు ముందు సిబిఐ కోరింది. 2021-22 ఎక్సైజ్ పాలసీలో ఇమిడిఉన్న భారీ అవినీతిని వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రధాన ముద్దాయిగా ఉన్న సిసోడియా లోతైన విచారణ అవసరం అని తెలిపింది. దీని మేరకు న్యాయమూర్తి నాగ్‌పాల్ తమ ఉత్తర్వులను వెలువరించారు. అప్పటికే స్థానిక రౌస్ అవెన్యూ కోర్టు ఆవరణలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసి ఉంచారు. సోమవారం కోర్టులో గంటన్నరకు పైగా వాదోపవాదాలు జరిగాయి. లిక్కర్ పాలసీలో మార్పులకు లెఫ్టినెంట్ గవర్నర్ సమ్మతించారని, అయితే ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ కావాలనే ఇక్కడి ఎన్నికైన ప్రజా ప్రభుత్వాన్ని టార్గెటు చేసుకుని వ్యవహరిస్తోందని సిసోడియా తరఫు న్యాయవాది తెలిపారు. మార్పులు చేర్పులకు సంబంధించి తాను చేసేది కానీ చేసింది కానీ ఏమీ లేదని, ఉండదని, దీనికి సముచిత అధికారిక ముద్ర పడాల్సింది కేవలం సంబంధిత ఉన్నత స్థాయి నుంచే అని సిసోడియా వివరించారు. తాను నేరం లేదా తప్పు చేసినట్లు ఎక్కడా ఎటువంటి సాక్షాధారాలు లేవని , తనపై కించిత్తు ఆధారం లేకుండానే రిమాండ్‌కు సిబిఐ కోరడం అనుచితం అని సిసోడియా న్యాయవాదులు వాదించారు.

ఢిల్లీ ఆర్థిక మంత్రి బడ్జెట్‌కు అవసరం కదా

తాను ఢిల్లీకి ఆర్థిక మంత్రిని అని కీలకమైన బడ్జెట్‌ను సమర్పించాల్సి ఉందని, ఈ బడ్జెట్ సమర్పణ దశలో ఆర్థిక మంత్రిని కస్టడీలోకి పంపించాల్సిన అవసరం ఉందా? అని సిసోడియా ప్రశ్నించారు. తరువాతి రోజుల్లో నేను అందుబాటులో ఉంటాను కదా, ఇప్పుడు అరెస్టు చేశారంటే దీని వెనుక దురుద్ధేశాలు ఉన్నట్లే కదా అని తెలిపారు. ఈ ఉదంతం ఓ వ్యక్తిపైనే కాకుండా మొత్తం వ్యవస్థపై జరిగిన దాడిగా భావించాల్సి ఉంటుందన్నారు. రిమాండ్ తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని, రిమాండ్‌ను తదుపరి చర్యలను నిలువరించేందుకు తగు ప్రాతిపదిక ఉందని సిసోడియా కోర్టుకు విన్నవించుకున్నారు. సిసోడియా కేవలం ఢిల్లీ ప్రభుత్వ సభ్యుడిగా అంటే మంత్రిగా వ్యవహరించాడని అంతకు మించి వ్యక్తిగత బాధ్యత ఏం ఉంటుందని సిసోడియా తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. మంత్రిమండలి సభ్యుడిగా ఉన్న వ్యక్తికి నిర్ణయ బాధ్యతను అంటగట్టడం, నిర్ణయం అంతా ఆయనే తీసుకున్నట్లు ప్రశ్నించడానికి దిగడం అనుచితం అవుతుందని తెలిపారు.

ఈ వాదనను దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. స్కామ్ జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయని, అరెస్టు అయిన మంత్రిని ఈ కేసుకు సంబంధించి మరింతగా విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకే కస్టడీని కోరుతున్నామని తెలిపారు. కేసులో తన పాత్ర లేదని సిసోడియా చెపుతున్నారని అయితే దర్యాప్తు క్రమంలో ఆయన సొంతంగానే నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడయిందని, దీనిని తాము పూర్తిస్థాయిలో నిర్థారించుకోవల్సి ఉందని తెలిపారు. సిసోడియా తరఫు న్యాయవాదులు సిబిఐ వాదనను వ్యతిరేకించారు. వారు తమ వద్ద ఉన్నాయని చెపుతున్న ఆధారాలు ప్రాతిపదిక లేనివని, సిసోడియా తన ఫోన్ మార్చుతూ వెళ్లారని సిబిఐ చెపుతోందని, ఫోన్లు మార్చడం నేరమా? అని ప్రశ్నించారు.
ఎల్‌జి అభిప్రాయం తీసుకున్నాకే నిర్ణయం జరిగింది

సిసోడియా తరఫు న్యాయవాదుల బృందం

పాలసీ అమలుకు సంబంధించి పలు సూచనలు తీసుకోవడం జరిగింది, చివరికి లెప్టినెంట్ గవర్నర్ సూచనలను తీసుకున్నామని, ఇది సంప్రదింపులతో కూడిన విషయం కాబట్టి సామూహిక రీతిలో వ్యవహరించినప్పుడు ఇందులో కుట్రకు పాల్పడటం ఇతరత్రా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొనడం దారుణం అని సిసోడియా కౌన్సిల్ తెలిపింది. తప్పు జరగలేదు. జరగని తప్పు జరిగినట్లు చెప్పి, దర్యాప్తునకు మరింత అవకాశం కల్పించాలని కస్టడీలోకి తీసుకోవాలని సిబిఐ కోరడం తప్పే అవుతుందని సిసోడియా తరఫు న్యాయవాదులు తెలిపారు. తాను ప్రతిదీ పారదర్శకంగా బహిరంగంగా ఉంచేందుకు యత్నిస్తూ వచ్చానని సిసోడియా కోర్టుకు తెలిపారు. సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాదులు దయాన్ కృష్ణన్, మొహిత్ మాథుర్, సిద్ధార్థ్ అగర్వాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కేసుకు సంబంధించి దర్యాప్తు సాగుతోంది
సిసోడియా కస్టడి అవసరం అన్న సిబిఐ

ఈ మద్యం కేసులో ఇప్పటికే పలు స్థాయిల్లో తాము దర్యాప్తు చేపట్టామని సిబిఐ కోర్టుకు తెలిపింది. ఈ దశలో సిసోడియా విచారణ దర్యాప్తు క్రమానికి అవసరం అని పేర్కొన్నారు. ఈ నెలారంభంలో ఈ కేసుకు సంబంధించి ఢిల్లీకే చెందిన మరో మంత్రి సత్యేందర్ జైన్‌ను తీహార్ జైలులో అధికారుల అనుమతి తరువాత సిబిఐ విచారించింది. ఆప్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి విజయ్ నాయర్‌ను కూడా సిబిఐ ప్రశ్నించింది. నాయర్‌కు ఈ కేసుకు సంబంధించి బెయిల్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News