Monday, December 23, 2024

లిక్కర్ కేసు: సిసోడియాకు మే 12వరకూ జైలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జుడిషియల్ కస్టడీని వచ్చే నెల 12వరకూ పొడిగించారు. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు గురువారం తన ఆదేశాలు వెలువరించింది. తమకు సిబిఐ అనుబంధ అభియోగపత్రం ఇ కాపీని అందచేయాలని ఈ సందర్భంగా ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్ ఆదేశించారు.

లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సిబిఐ సిసోడియాను అరెస్టు చేసింది. సిసోడియా బెయిల్ దరఖాస్తుకు పలుసార్లు కోర్టు నుంచి చుక్కెదురవుతూ వస్తోంది. కాగా సిసోడియా బెయిల్ దరఖాస్తుపై కోర్టు శుక్రవారం తన నిర్ణయం ప్రకటిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News