Thursday, January 23, 2025

విద్య ప్రాధాన్యత మోడీకి తెలియదు: జైలు నుంచి సిసోడియా లేఖ

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: విద్య ప్రాధాన్యత ప్రధాని నరేంద్ర మోడీకి అర్థం కాదని ఆరోపిస్తూ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుల్రో అరెస్టయి జుడిషియల్ రిమాండ్‌లో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా దేశ ప్రజలనుద్దేశించి లేఖ రాశారు.
ప్రధానమంత్రి చదువుకోని వ్యక్తి అయితే దేశానికే ప్రమాదమని ఆ లేఖలో సిసోడియా పేర్కొన్నారు. ఢిలీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ట్విటర్ ఖాతాలో తన మాజీ సహచరుడి లేఖను పోస్ట్
చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీకి సైన్స్ అర్థం కాదు&విద్యా ప్రాధాన్యతను ఆయన అర్థం చేసుకోలేరు అని తన లేఖలో సిసోడియా ఆరోపించారు. గత కొన్ని ఏళ్లలో దేశవ్యాప్తంగా 60,000 స్కూళ్లు మూతపడ్డాయని ఆయన తెలిపారు. భారతదేశ పురోభివృద్ధికి విద్యావంతుడైన ప్రధానమంత్రి అవసరమని ఆయన తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి అవినీతి ఆరోపణలపై సిసోడియాను సిబిఐ ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News