Sunday, January 19, 2025

మరిది పెళ్లి వేడుకలో డాన్స్ ఇరగదీసిన వదిన!

- Advertisement -
- Advertisement -

పెళ్లి ఊరేగింపులో డాన్స్ చేయడం ఇటీవలి కాలంలో సరదాగా మారింది! ఆ మధ్య పెళ్లి కూతురే స్వయంగా బుల్లెట్ బండి పాటకు డాన్స్ చేసి, అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి ఊరేగింపులకు ఉత్తర భారతం పెట్టింది పేరు. పెళ్లికొడుకు గుర్రంపై తన బంధుమిత్ర సపరివారంగా వచ్చే ఊరేగింపునకు ఎంతో ప్రాధాన్యమిస్తారు.

తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు గానీ, ఊరేగింపు జరుగుతుండగా పెళ్లికొడుకు వదిన ముందుకొచ్చి చిందులేస్తూ అందరినీ హుషారెక్కించింది. హమ్ ఆప్కే హై కౌన్ మూవీలోని ‘లో చలీ మై’ పాటకు ఆమె చలాకీగా డాన్స్ చేస్తూంటే, ఊరేగింపులో పాల్గొన్న పలువురు ఆమెతోపాటు లయబద్దంగా కాళ్లు కదుపుతూ డాన్స్ చేశారు. గుర్రంపై ఉన్న పెళ్లి కొడుకు కూడా వదినగారి డాన్స్ ను ఎంజాయ్ చేస్తూ, పాటకు అనుగుణంగా కదులుతూ ఊరేగింపును రక్తి కట్టించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News