Monday, December 23, 2024

ఆస్తీ కోసం తమ్ముడిపై అక్క,బావ హత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి : ఆస్తీ కోసం తన అక్క,బావ తనను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నరని గొరంటి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం కాప్రా సర్కిల్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొమ్మల రామరం మండలం మాధపూర్‌కు చెందిన గొరంటి శ్రీనివాస్(45) తనకు ఒక తమ్ముడు, ఒక అక్క ఉన్నరని అమ్మ చనిపోవడంతో నాన్న రెండవ వివాహం చేసుకుని వెళ్లి పోయాడని తెలిపారు. కాగ తాను బ్రహ్మచారీగా చర్లపల్లి డివిజన్ చక్రీపురంలో నివాసముంటూ పలు సేవా కార్యక్రమలు చేస్తున్ననని తెలిపారు.

తనవద్ద ఉన్న ఆస్తీ కోసం తన సొంత అక్క,బావ శ్రీలక్ష్మి రవీందర్‌లు కొంత మంది కీరాయి గుండాలతో తనను హత్య చేసేందుకు మార్చి 26వ తేదిన చక్రీపురంలోని తన ఇంటికి వచ్చి చిత్రహింసలు పెట్టి ఆస్తీ పత్రాలు దొంగలించేందుకు యత్నించారని తెలిపారు. ఇందుకు సంభదించిన పూర్తి ఆధారాలు, కాల్‌ రికార్డులు తన వద్ద ఉన్నయని చూపించారు. ఈమేరకు రవీందర్,శ్రీలక్ష్మిలపై కుషాయిగూడ పోలీస్‌స్టేసన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు.

కుషాయిగూడ పోలీసులు వారిని పిలిచి మట్లాడిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. వారు తిరిగి నాపై హత్యయత్నం చేసే అవకాశం ఉందని తనకు రక్షణ కల్పించడంతో పాటు నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News