Monday, December 23, 2024

చెల్లె శవపరీక్ష కోసం వచ్చి రోడ్డు ప్రమాదంలో అన్న మృతి..

- Advertisement -
- Advertisement -

పురుగుల మందు తాగి ఆత్మహాత్య చేసుకున్న చెల్లె పోస్టుమార్టం కోసం వచ్చిన ఆమె అన్న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన విషాద నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం ఊకొండి గ్రామానికి చెందిన దొడ్డి కేశయ్య భార్య 2006లోనే చనిపోగా వారికి సంధ్యారాణి(17), సాయి(19) ఉన్నారు. తల్లి చనిపోయిన నాటి నుంచి సంధ్యారాణి తన అమ్మమ్మ ఊరైన చౌటుప్పల్ మండలం తూర్పు గూడెంలో ఉంటూ పదవ తరగతి వరకూ అక్కడే చదివింది.

ఏడాదిన్నర క్రితం ఊకొండికి వచ్చి ఇక్కడే ఉంటూ మునుగోడు కేజీబీవీలో ఇంటర్ చదువుతోంది. ఆమె అన్న సాయి బతుకు దెరువు కోసం వేరే ప్రాంతానికి కూలీకి వెళ్లి ఉంటున్నాడు. సొంత ఊరిలో ఇళ్లు లేకపోవడంతో వారు వ్యవసాయ బావి వద్ద గుడిసె వేసుకుని ఉంటుండగా శనివారం ఎవరూలేని సమయంలో సంధ్యా రాణి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా గుర్తించిన ఆమె తండ్రి కేశయ్య గమనించి 108లో నల్లగొండకు తరలిస్తుండగా మర్గమధ్యలో చనిపోయింది. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అయితే, విషయం తెలసుకుని చెల్లె పోస్టుమార్టం కోసం నల్లగొండకు వచ్చిన సంధ్యారాణి సోదరుడు సాయి(19)కి పెద్ద బండ సమీపంలో గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు సాయిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. రెండు రోజుల వ్యవధిలోనే అన్నా చెల్లెలు దుర్మరణం చెందడంతో వారి కుటుంబంతోపాటు గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News