Wednesday, November 13, 2024

చనిపోయిన అన్నకి రాఖీ కట్టిన చెల్లెలు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి : అన్న మృతదేహం దగ్గర ఆ చెల్లెలు రోదనలు ఊరందరినీ కదిలించాయి. మరికొద్ది గంటల్లో రాఖీ పండుగ.. ఆనందంగా.. పుట్టింటికి బయల్దేరిన చెల్లెలికి ఊహించని షాక్ ఎదురైంది. ఈ హృదయ విదారక ఘటన ఆగస్టు 30వ తేదీన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్ట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దూళికట్ట గ్రామానికి చెందిన చౌదరి కనకయ్య అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. మంగళవారం యథావిధిగా భోజనం చేసి పడుకున్న కనకయ్య ఆగస్టు 30వ తేదీ బుధవారం ఉదయం తీవ్ర గుండెపోటుతో ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు.

షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు అందరికీ సమాచారం అందించారు. అయితే అప్పటికే రాఖీ పండుగకు అన్నయ్యకు రాఖీ కట్టేందుకు బయలుదేరిన కనకయ్య చెల్లెలు గౌరక్కకు ఈ సమాచారం తెలిసింది. విషయం తెలిసిన వెంటనే అన్నయ్య ఇంటికి వెల్లిన గౌరక్క అన్నయ్యను చూసి తట్టుకోలేకపోయింది. అన్నా.. నీ రక్షకు రాఖీ కొన్నాను.. లేచి రాఖీ కట్టించుకో అంటూ బోరున విలపించారు. చనిపోయిన సోదరుడి చేతికి ఎంతో ప్రేమతో తెచ్చిన రాఖీని కట్టి తన రుణం తీర్చుకుంది. వేడుకగా జరగాల్సిన పండుగను చూసి ఊరంతా కన్నీరుమున్నీరైంది.. చనిపోయిన అన్నయ్య చేతికి రాఖీ కట్టే సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఎంతో ఆరోగ్యంగా ఉన్న కనకయ్య.. హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందడంతో.. రాఖీ కట్టడానికి వచ్చిన ఆయన సోదరి గౌరమ్మ పుట్టెడు దుఖంతో కడసారిగా కనుకయ్య మృతదేహానికి రాఖీ కట్టి అన్నను సాగనంపింది. చెల్లెలు అనురాగాన్ని చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News