హైదరాబాద్ : రక్షా బంధన్ వేడుకలు శుక్రవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఘనంగా జరిగాయి. రాఖీ పండుగ సందర్భంగా ప్రేమ ఆప్యాయతలు, సహోదర భావాలు వెల్లివిరిసాయి. సోదరీమణుల రాకతో సిఎం నివాసంలో సందడి నెలకొంది. ఇంటికి వచ్చిన తమ ఆడ బిడ్డలను సిఎం సతీమణి శోభమ్మ సాదరంగా, సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌కు వారి అక్కలు, లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టి రక్షా బంధన్ వేడుకలు జరుపుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా తనకు రాఖీలు కట్టిన అక్కలకు సిఎం కెసిఆర్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. తమ సోదరున్ని నిండు మనసుతో ఆశీర్వదించారు. అదే సందర్భంలో కెసిఆర్ మనుమడు మనుమరాలు రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు.
తన అన్న హిమాన్షుకు చెల్లె అలేఖ్య రాఖీ కట్టింది. ఈ సందర్భంగా తమ మనుమడు మనుమరాలును నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని సిఎం కెసిఆర్, శోభమ్మ దంపతులు నిండు మనసుతో దీవించారు. వేడుకల్లో పాల్గొన్న పెద్దలు కూడా చిన్నారులను దీవించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ సతీమణి శైలిమ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. అంతకు ముందు ఉదయం ప్రగతి భవన్‌లో తన అన్న కెటిఆర్‌కు చెల్లె కవిత రాఖీ కట్టి రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. కెటిఆర్ చెల్లెలు సౌమ్య (చిన్నమ్మ కుతురు, ఎంపి సంతోష్‌కుమార్ సోదరి) రాఖీ కట్టి వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే ప్రగతి భవన్ కార్యాలయ మహిళా సిబ్బంది కూడా రాఖీ వేడుకల్లో పాల్గొని మిఠాయిలు పంచారు.
రాఖీ పండుగ సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి రాఖీ కట్టిన ఆయన సోదరీమణులు.#RakshaBandhan pic.twitter.com/CSw2PWCjAU
— Telangana CMO (@TelanganaCMO) August 12, 2022