Friday, November 15, 2024

అమ్మకానికి చిన్నారుల డేటా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కీలక నిందితుడిని శనివారం అరెస్టు చేసింది. నిందితుడి వ ద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రెండు ల్యా ప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితు డి ల్యాప్‌టాప్‌లో 66.9 కోట్ల మంది వ్యక్తిగత వివరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో 9, 10, 11, 12 తరగతులకు చెం దిన విద్యార్థుల సమాచారం కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం..డేటా చోరీ కేసులో గతంలో ఏడుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సిట్ ఏర్పాటు చేశారు. సిట్ దర్యాప్తులో హర్యానా, ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ విషయం బయటికి వచ్చింది.

నిందితుడు డేటాను చోరీ చేసి దానిని సైబర్ నేరస్థులకు విక్రయించేందుకు సోషల్ మీడియాలో పెట్టినట్లు తెలియడంతో అరెస్టు చేశారు. నిందితుడి వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దా నిలో 66.9కోట్ల మంది డేటా ఉండడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వినయ్ inspirewebz వెబ్‌సైట్ ఏర్పాటు చేసి దాని ద్వారా చోరీ చేసిన డేటాను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు జీఎస్టి, పాన్‌కార్డు, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూ బ్, ఫోన్ పే, పేటిఎం, జోమాటో, పాలసీబజార్,బిగ్‌బాస్కెట్, ఇన్‌స్టాగ్రామ్, బుక్‌మై షో, ఆప్ స్టాక్స్, బైజూస్ నుంచి డేటాను చోరీ చేశా డు. 24 రాష్ట్రాలు, 8 మెట్రో పాలిటన్ సిటీల నుంచి వినయ్ డేటా చోరీ చేసినట్లు పోలీసు లు గుర్తించారు. వినయ్‌పై ఐపిసి 409,413, 420,ఐటియాక్ట్ 66సి, 43 ఎ, 72 ఏ కింద కేసులు నమోదు చేశారు. నిందితుడిని కోర్టు లో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.

డిఫెన్స్ పర్సన్స్ డేటా…

వినయ్ ల్యాప్‌టాప్‌లో డెఫెన్స్‌కు చెందిన వారి డేటా, ప్రభుత్వ ఉద్యోగుల డేటా లభించిం ది. డిమ్యాట్ ఖాతాదారులు, నీట్ విద్యార్థు లు, ఇన్సూరెన్స్ హోల్డర్స్, క్రెడిట్, డెబిట్ కార్డు హోల్డర్ల డేటా సేకరించాడు. ఆరు మెట్రో పాలిటన్ సిటీలు, గుజరాత్‌కు చెందిన 4.5లక్షల మంది డేటాను చోరీ చేశాడు. డ్రైవర్లు, డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, స్టాక్‌బ్రోకర్లు డేటాను, పాన్ కార్డుతోపాటు వారి ఇన్‌కం, ఈమెయిల్ ఐడిలు, ఫోన్ నంబర్లు, అడ్రస్, ప్రభుత్వ ఉద్యోగుల మొబైల్ నంబర్లు, కేటగిరి, డేట్ ఆఫ్ బర్త్ తదితరాలను సేకరించాడు.

అన్ని సిటీల డేటా సేకరించాడు…

వెస్ట్‌బెంగాల్ 70లక్షలు, ఉత్తరప్రదేశ్ 21.39కోట్లు, తమిళనాడు 1.02కోట్లు, రాజస్థాన్ 2కోట్లు, పంజాబ్ 1.5కోట్లు, పూణే 12లక్షలు, ఒడిసా 30లక్షలు, నార్త్‌ఈస్ట్ 60లక్షలు, ముంబాయి 46లక్షలు, మహారాష్ట్ర 4.50కోట్లు, మధ్యప్రదేశ్ 1.10కోట్లు, కోల్‌కటా 46లక్షల మంది, కేరళ 1.57కోట్లు, జమ్ము అండ్ కశ్మీర్ 25లక్షల మంది, జైపూర్ 68లక్షలు, హైదరాబాద్ 56లక్షలు, హర్యాణా కోటి మంది, ఢిల్లీకి చెందిన 20లక్షలమంది, చెన్నై 70లక్షలు, బీహార్ కోటి, బెంగళూరు 60లక్షలు, అస్సాం 90లక్షలు, ఆంధ్రప్రదేశ్ 2.10కోట్ల మంది డేటాను చోరీ చేసి అమ్మకానికి పెట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News