Monday, January 20, 2025

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసు.. రూ.1.63 కోట్ల లావాదేవీలు.

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో శుక్రవారం కోర్టులో సిట్ చార్జీషీట్ దాఖలు చేసింది. ప్రశ్నాపత్రాల లీక్ కేసులో రూ. 1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించినట్టుగా చార్జీషీట్‌లో వెల్లడించింది. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో ఇప్పటివరకు 49 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలిపింది. ఈ కేసులో 16 మంది మధ్యవర్తులుగా వ్యవహరించారని చార్జీషీట్‌లో పేర్కొంది. ఈ కేసులోని నిందితుడు ఒకరు న్యూజిలాండ్‌లో ఉన్నారని చార్జీషీట్‌లో తెలిపింది. గ్రూప్ -1 ప్రశ్నాపత్రం నలుగురికి లీకైందని తెలిపింది. ఎఇఇ పరీక్షలో ముగ్గురు అభ్యర్ధులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారని చార్జీషీట్ లో వివరించింది. రాజశేఖర్, ప్రవీణ్, రేణుక , ఢాక్యానాయక్ లను ప్రధాన నిందితులుగా సిట్ పేర్కొంది.

మొత్తం 37 మందిపై టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో అభియోగాలు మోపింది. నిందితుల నుండి సెల్ ఫోన్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీకి ఉపయోగించిన మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని చార్జీషీట్ లో తెలిపింది. డిఎఒ ప్రశ్నపత్రం ఎనిమిది మందికి లీకైందని తెలిపింది. టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నాపత్రాలు కాన్పిడెన్షియల్ సెక్షన్ నుండి లీకైనట్టుగా చార్జీషీట్ లో ప్రస్తావించింది. ఈ ఏడాది మార్చి 11న టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. తొలుత టిఎస్‌పిఎస్‌సి కార్యాలయంలో కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని అనుమానించారు.

కానీ పోలీసుల విచారణలో పేపర్లు లీకయ్యాయని వెల్లడైంది. ఈ ఏడాది మార్చి మాసంలో జరగాల్సిన టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్, సివిల్ అసిస్టెంట్ల సర్జన్ల నియామకం పరీక్షలను టిఎస్‌పిఎస్‌సి వాయిదా వేసింది. టిఎస్‌పిఎస్‌సి కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని ఈ పరీక్షలను వాయిదా వేశారు. అయితే మార్చి 5 వ తేదీన జరిగిన ఎఇఇ పరీక్ష పేపర్ లీకైన విషయం పోలీసుల విచారణలో తేలింది. దీంతో పలు పరీక్షలను వాయిదా వేశారు. కొన్ని పరీక్షలను రద్దు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News