Sunday, January 19, 2025

ఎంఎల్‌ఎ రేవణ్ణ నివాసంలో సిట్ తనిఖీ

- Advertisement -
- Advertisement -

ఒక మహిళను అపహరించి, అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణ సందర్భంగా జెడి (ఎస్) ఎంఎల్‌ఎ హెచ్‌డి రేవణ్ణపై కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం బెంగళూరు బసవనగుడిలోని ఆయన నివాసంలో స్పాట్ తనిఖీ నిర్వహించింది. రేవణ్ణ కుటుంబ సభ్యులు ఎవరూ లేనికారణంగా ఆయన న్యాయవాది గోపాల్‌ను స్పాట్ తనిఖీ కోసం సిట్ పిలిపించింది. సిట్ రెండు రోజుల క్రితం హాసన్ జిల్లా హోలెనరసిపురలో ఎంఎల్‌ఎ నివాసంలో తనిఖీ నిర్వహించింది. మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ కుమారుడైన రేవణ్ణ రెండు కేసులు ఎదుర్కొంటున్నారు. వాటిలో ఒకటి వంటమనిషిపై అత్యాచారానికి సంబంధించినది. ఆ కేసులో రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ కూడా ఒక నిందితుడు. రెండవ కేసు ఈ నెల 2న నమోదు చేసిన కిడ్నాపింగ్ కేసు.

తన తల్లి చేతులు కట్టివేసి ప్రజ్వల్ అత్యాచారం చేసినట్లుగా వీడియోలు బహిర్గతం అయిన తరువాత రేవణ్ణ సహాయకుడు సతీష్ బాబన్న ఏప్రిల్ 29న ఆమెను ఒక బైక్‌పై తీసుకువెళ్లి అక్రమ నిర్బంధంలో ఉంచినట్లు బాధితురాలి కుమారుడు ఆరోపించారు. ఆ మహిళను రక్షించారు. ఆమెను లైంగికంగా హింసించిన ప్రదేశాలకు పోలీస్ బృందం వెళుతోంది. అత్యాచారం జరిగిన వివిధ ప్రదేశాలకు ఇద్దరు ఫిర్యాదీలను సిట్ తీసుకువెళ్లింది. ఇది ఇలా ఉండగా, జెడి (ఎస్) నేత బసవనగుడి నివాసం లోపలికి తనను సిట్ అనుమతించలేదని రేవణ్ణ న్యాయవాది గోపాల్ ఆరోపించారు. స్పాట్ తనిఖీ కోసం తనకు నోటీస్ ఇచ్చారని, కానీ సిట్ తనను లోపలికి అనుమతించలేదని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News