Wednesday, January 22, 2025

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో ముగిసిన నిందితుల సిట్ కస్టడీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ కేసులో నిందితులకు సిట్ కస్టడీ ముగిసింది. ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్‌కు కస్టడీ ముగిసినట్లు అధికారులు తెలిపారు. నలుగురు నిందితులను నాంపల్లి కోర్టులో హాజరు పర్చామని సిట్ అధికారులు పేర్కొన్నారు. విచారణలో నిందితులు సిట్ అధికారులకు కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులను మూడో రోజు విచారణలో భాగంగా మంగళవారం ఉదయం నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్‌లను పోలీసులు సిట్ కార్యాలయానికి తీసుకొచ్చా రు. ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు 15 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని సిట్ విచా రించింది. ఎఇ ప్రశ్నాపత్ర లీకేజీ నిందితులు డాక్యా అండ్ టీం ఎంతమందికి పేపర్ అమ్మారనే విషయాలు రాబట్టే పనిలో సిట్ అధికారులు ఉన్నా రు. రేణుక, డాక్యా నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు అత్యధికంగా ప్రశ్నాపత్రాలు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. లీకేజ్‌లో భాగంగా చైన్ ప్రాసెస్‌పై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. అక్టోబర్ 1న శంకర్ లక్ష్మి డైరీలో పాస్ వర్డ్‌ను ప్రవీణ్ కొట్టేసినట్లు తెలిసింది. గ్రూప్ 1, ఎఇ, టౌన్ ప్లానింగ్ పేపర్లు అన్ని అక్టోబర్‌లోనే ప్రవీణ్, రాజశేఖర్ కొట్టేసినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసులో మరో ముగ్గురికి ఐదు రోజులు కోర్టు కస్టడీ విధించింది. సురేశ్, రమేశ్, షమీమ్‌ను కస్టడీకి నాంపల్లి ధర్మాసనం అనుమతించింది. బుధవారం నుంచి ముగ్గురికి ఐదు రోజుల పాటు కస్టడీలో ఉండనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News