- Advertisement -
తిరువనంతపురం : కేరళలోని కొచ్చి వద్ద ఆదివారం కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన పేలుళ్లపై 20 మందితో కూడిన సిట్ దర్యాప్తు జరుపుతుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారులతో చర్చల తరువాత ప్రకటించారు. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుపుతుంది. 20 మంది సభ్యులతో ప్రత్యేక బృందం విచారణ నిర్వహిస్తుంది. ఈ సిట్‌కు శాంతిభద్రతల అదనపు డిజిపి సారధ్యం వహిస్తారు. పేలుళ్లలో ఇద్దరు చనిపోగా , 42 మంది వరకూ గాయపడ్డారని ముఖ్యమంత్రి విలేకరులకు తెలిపారు. పేలుళ్ల ఘటనపై చర్చించేందుకు సోమవారం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తుననట్లు సిఎం వెల్లడించారు.
- Advertisement -