Monday, January 20, 2025

ఓఆర్‌ఆర్ టెండర్ లీజుపై సిట్ విచారణ

- Advertisement -
- Advertisement -

వైఎస్ ప్రభుత్వం అప్పు తెచ్చి
నిర్మించిన అద్భుత సంపదను
అప్పనంగా అమ్ముకున్న గత
ప్రభుత్వ పెద్దలు ఎన్నికల
ముంగిట్లో హడావుడి నిర్ణయం
ఓటమి తప్పదని తెలిసే టెండర్లు
బిఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు సూచన
మేరకే విచారణకు నిర్ణయం
కేబినెట్‌లో చర్చించి విధివిధానాలు
ఖరారు అసెంబ్లీలో సిఎం
రేవంత్‌రెడ్డి ప్రకటన తొలుత
టెండర్లు రద్దు చేయండి :
హరీశ్‌రావు సవాల్

ఓఆర్‌ఆర్ టెండర్ లీజుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిట్ విచారణకు ఆదేశించారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నట్లు సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఓఆర్‌ఆర్ పై విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటు చేస్తామని సిఎం అన్నారు. సభ్యుల ఆమోదంతో విచారణకు ఆదేశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జైకా నుంచి నిధులు తెచ్చి ఓఆర్‌ఆర్ నిర్మించారని, దానిని బిఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పన్నంగా దాని టెండర్‌లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిందని సిఎం రేవంత్ ధ్వజమెత్తారు. ఎయిర్‌పోర్టు, ఓఆర్‌ఆర్, ఐటీ కంపెనీలను తీసుకొచ్చి హైదరాబాద్ విశ్వనగరంగా చేసిందని కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. క్రెడెట్ అంతా కాంగ్రెస్‌కే దక్కుతుందని సిఎం రేవంత్ తెలిపారు.

అంతేకాకుండా ప్రజల అవసరాలు తీర్చాలని కృష్ణ, గోదావరి నీళ్లు తేవడానికి పిజేఆర్ ఉద్యమాలు చేశారని సిఎం రేవంత్ గుర్తుచేశారు. హైదరాబాద్‌కు మెట్రో రైలు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్సే అని సిఎం రేవంత్ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా మారడానికి కాంగ్రెస్ కారణమని ఆయన వివరించారు. వేల కోట్ల ఓఆర్‌ఆర్ ఆస్తిని అప్పన్నంగా అమ్ముకున్నారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలు ఓడించబోతున్నారని తెలిసి బిఆర్‌ఎస్ నాయకులు ఓఆర్‌ఆర్‌ను అమ్మేసుకున్నారని ఆయన ఆరోపించారు. దేశం విడిచిపెట్టి పోవాలన్న ఉద్దేశంతోనే ఓఆర్‌ఆర్ ఆస్తులను గత ప్రభుత్వాధినేతలు అమ్మేసుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హరీశ్‌రావు విచారణ కోరారని, ఆయన కోరిక మేరకు సిట్ విచారణకు ఆదేశిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. విధి, విధానాలు కేబినెట్‌లో చర్చించి విచారణ చేయిస్తామని రేవంత్ తెలిపారు.

ఓఆర్‌ఆర్ టెండర్‌పై తాను విచారణ కోరలేదు: హరీష్‌రావు
ఓఆర్‌ఆర్‌పై సిఎం రేవంత్‌రెడ్డి సిట్ విచారణకు ఆదేశించడంపై హరీశ్‌రావు స్పందించారు. ఓఆర్‌ఆర్ టెండర్‌పై తాను విచారణ కోరలేదన్నారు. అయినా కూడా విచారణను స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముందు టెండర్ రద్దు చేసి విచారణకు ఆదేశించాలని హరీష్‌రావు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News