Wednesday, January 22, 2025

ముగిసిన టిఎస్‌పిఎస్‌సి సభ్యుడి విచారణ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో శనివారం కమిషన్ సభ్యుడు లింగారెడ్డి, సెక్రటరీ అనితరామచంద్రన్‌ను విచారించారు. పేపర్ లీకేజీ కేసులో విచారణ చేస్తున్న సిట్ తమ ఎదుట హాజరు కావాలని టిఎస్‌పిఎస్‌సి సభ్యుడు లింగారెడ్డి, కమిషన్ కార్యదర్శి అనితరామచంద్రన్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో అరెస్టైన రమేష్ కమిషన్ సభ్యుడు లింగారెడ్డి వద్ద పిఎగా, కార్యదర్శి వద్ద ప్రవీణ్ పిఎగా పనిచేశారు. కమిషన్ కీలకంగా భావించే కార్యదర్శి వద్దే అన్ని ప్రశ్నపత్రాలు, రహస్య సమాచారం ఉంటుంది. కాన్ఫిడెన్షిల్ విభాగం మొత్తం టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శి ఆదీనంలో ఉంటుంది. ప్రశ్నపత్రాల తయారీ, భద్రపరచడం తదితరల కార్యక్రమాలన్నీ కార్యదర్శి ఆధీనంలో ఉంటుంది.

అక్కడి నుంచి పేపర్లు లీక్ కావడంతో సిట్ అధికారులు కార్యదర్శిని విచారణకు పిలిచారు. ఆమె వద్ద పనిచేసే ప్రవీణ్ గ్రూప్ వన్ రాసిన విషయం ఆమె తెలుసా లేదా, పేపర్ లీకేజీకి సంబంధించిన వివరాలు, ప్రవీణ్ విషయాలపై సిట్ అధికారులు ప్రశ్నించారు. అనితారామచంద్రన్ చెప్పిన వివరాలను సిట్ అధికారులు రికార్డు చేశారు. కమిషన్ సభ్యుడు లింగారెడ్డి వద్ద పిఎగా పనిచేసిన రమేష్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేశారు. దీనిపై లింగారెడ్డిని సిట్ అధికారులు రెండు గంటల పాటు ప్రశ్నించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News