Friday, January 10, 2025

స్పీడ్‌గా సిట్ దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు వేగవంత మైం ది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రో జుకో ట్విస్టు చోటు చేసుకుంటోంది. కేసులో కీలకంగా ఉండి, పరారీలో ఉన్న ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు సోమవారం హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో నిందితులైన పోలీస్ అధికారుల నేరాగీకారం, కస్టడీ రి పోర్టు ఆధారంగా గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోని ప్రముఖ లీడర్లకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సదరు నేతల్లో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎంఎల్‌ఎలు, ఇద్దరు ఎంఎల్‌సిలు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే న్యాయ సలహాలు తీసుకుంటున్నట్టు తెలిసింది. దర్యాప్తులో సేకరించిన నిందితుల కాల్‌డేటా, వాట్సాప్ చాటింగ్స్, ఫార్మా, రి యల్ ఎస్టేట్, ఐటి కంపెనీలకు చెందిన బాధితులు అందించిన సమాచారం ఆధారంగా సంబంధిత లీ డర్లకు నోటీసులు ఇవ్వనున్నారు. ఇందుకు ప్రణీత్‌రావు, టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్‌రావు స్టేట్‌మెంట్ కీలకంగా మారినట్టు తెలిసింది. అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు చెప్పిన విధంగా ఆపరేషన్స్ చేసినట్టు పోలీసు దర్యాప్తులో వీరిద్దరు వెల్లడించినట్టు సమాచారం. ఎస్‌ఐబి లాగర్ రూ మ్ నుంచి డిఎస్‌పి ప్రణీత్ రావు అందించిన ఫోన్‌నెంబర్స్, వాయిస్ రికార్డింగ్స్ ఆధారంగా గత ఎలక్షన్స్ సమయంలో

రాధాకిషన్ రావు టీమ్ స్పెషల్ ఆపరేషన్స్ చేసిన సంగతి ఇప్పటికే వెల్లడైంది. ఇందులో అధికార పార్టీ మినహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్ధులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా ఉన్న కీలక నాయకుల డబ్బులను పట్టుకున్నారు. కంపెనీల అవసరాల కోసం బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తున్న డబ్బులను కూడా సీజ్ చేశారు. ముఖ్యనాయకుల అనుచరులు, ఆర్థిక వ్యవహరాలు చూసే సిబ్బంది ఫోన్లను ట్యాప్ చేశారు. డబ్బుతో ప్రయాణించే వారి వివరాలతో నిఘా పెట్టారు. స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్‌లో పట్టుకుని సీజ్ చేశారు. ఇలా స్వాధీనం చేసుకున్న డబ్బులో కొంతమాత్రమే లెక్కలు చూపేవారని ఆరోపణలు న్నాయి. పార్టీ ఫండ్, క్యాష్ ట్రాన్స్‌పోర్ట్ చేసేందుకే ఎస్‌ఐబి,టాస్క్‌ఫోర్స్, ఎస్వోటీ పోలీసులను వాడుకున్నారని పోలీస్ దర్యాప్తులో వెలుగు చూసినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్, బ్లాక్ మెయిలింగ్, బడా వ్యాపార వేత్తలు, ప్రముఖ కంపెనీలు, కాంట్రాక్టర్ల ద్వారా రూ.వందల కోట్లు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేయించారని ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించినట్టు సమాచారం. ఈ మేరకు నిందితులు తెలిపిన వివరాలతో బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తులు, కంపెనీల వివరాలను సేకరిస్తున్నట్టు తెలిసింది. ఎలక్టోరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాండ్లు కొనుగోలు చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇందుకుగాను ఆయా సంస్థలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి చేకూరిందనే కోణంలో పరిశోధన జరుగుతున్నది.

ఈ క్రమంలోనే ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్న స్టేట్‌మెంట్స్ ఆధారంగా సంబంధిత లీడర్లకు నోటీసులు ఇచ్చే అవకా శాలు ఉన్నట్టు సమాచారం. మునుగోడు, హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముందే ప్రణీత్‌రావు టీమ్ ఆపరేషన్స్ ప్రారంభించింది. గత ప్రభుత్వ పెద్దలు అందించిన ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసి, టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందించింది. దీంతో రాధాకిషన్ రావు టీమ్ ప్రతిపక్షపార్టీలకు చెందిన డబ్బు రవాణాను అడ్డుకు న్నారు. దీంతోపాటు హవాలా డబ్బును పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. అయితే, తనిఖీల్లో పట్టుబడ్డ డబ్బు చేతులు మారినట్టు సమా చారం. చాలా మంది హవాలా వ్యాపారులు ఎలాంటి కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు అధికారులు అడిగినంత అప్పగించారని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో వెలుగు చూసినట్టు తెలిసింది. వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలను ప్రత్యేక దర్యాప్తు బృందం సేకరిస్తున్నట్టు సమాచారం. మరోవైపు తిరుపతన్న, భుజంగరావు వాడిన కంప్యూటర్స్, సెల్‌ఫోన్స్ ను అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. సోమవారం నాంపల్లి కోర్టులో రాధాకిషన్ రావును వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ దర్యాప్తు బృందం పిటిషన్ వేయనుంది.

నా ఫోన్ ట్యాప్ చేసి రూ.కోట్లు వసూలు చేశారు
రాధాకిషన్‌రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల విచారణ మూడో రోజు కొనసాగింది. మరోవైపు తన ఫోన్ ట్యాప్ చేశారని రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా శ్రీధర్ రావు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో రాధాకిషన్‌రావుపై ఫిర్యాదు చేశారు. తన ఇంటికి వచ్చి రాధాకిషన్‌రావు రూ.కోట్లు తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపన్నల విచారణ మూడో రోజు కొనసాగింది. వారిద్దరూ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరికొంత మందికి నోటీసు లిచ్చేం దుకు దర్యాప్తు బృందం సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో నలుగురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్టయ్యారు. తాజాగా ఇద్దరు అదనపు ఎస్పీల వాంగ్మూలం ఆధారంగా, మరికొంత మంది పేర్లు తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెస్ట్ జోన్ డిసిపి విజయ్‌కుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం కొనసాగిస్తున్న దర్యాప్తులో భాగంగా రాధాకిషన్‌రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్నలు వెల్లడించిన వివరాలను పోలీసులు క్రాస్ చెక్ చేస్తున్నారు. ట్యాపింగ్ వ్యవహారం ఒక్కటే కాకుండా, టాస్క్‌ఫోర్స్‌లో సుదీర్ఘకాలం కీలకంగా ఉన్న రాధాకిషన్ రావుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్‌తో అక్రమంగా కోట్ల రూపాయలు కూడబెట్టారంటూ కొంతమంది బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
వ్యాపారినీ విచారించిన సిట్…
టాస్క్‌ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్‌రావుపై ఫిర్యాదు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా శ్రీధర్‌రావుని అధికారులు విచారించారు. న్యాయవాదితో కలిసి విచారణకు హాజరైన ఆయన వాంగ్మూలాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం రికార్డు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News