Monday, December 23, 2024

ఎంఎల్‌ఎలకు ఎర కేసు.. సిట్ దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏల కొనుగోలు కేసు దర్యాప్తు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పా టు చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి రవిగుప్త ఉత్తర్వులు జారీ చేశారు. సిట్‌కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అధ్యక్షత వహించనుండగా స భ్యులుగా నల్గొండ ఎస్‌పి రెమా రాజేశ్వరి, సైబరాబాద్ క్రైం డిసిపి కల్మేశ్వర్ సింగనవార్, శంషాబా ద్ డిసిపి జగదీశ్వర్‌రెడ్డి, నారాయణపేట ఎస్పి వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఎసిపి గంగాధర్, మొయినాబాద్ ఇన్స్‌స్పెక్టర్ లక్ష్మిరెడ్డిని నియమించింది. ప్రత్యే దర్యాప్తు బృందం విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. హై ప్రొఫైల్ కేసు కా వడంతో విచారణ పారదర్శకంగా జరగాలని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలను కొనుగోలు చేసేందుకు డబ్బులు ఎర చూపి పార్టీ మారాలని మొయినాబాద్ ఫౌం బేరసారాలు చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసిన విష యం తెలిసిందే. ఈ కేసులో బిజెపి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు తొలుత దర్యాప్తుపై స్టే విధించింది. తాజాగా కోర్టు ఎంఎల్‌ఏల కొనుగోలుపై పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చునని చెబుతూ జస్టిస్ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం స్టే ఎత్తివేయడంతో తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీసులు కేసును దర్యాప్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు దర్యాప్తు నిలిపివేయడం మంచిది కాదని కోర్టు వ్యాఖ్యానించింది.

కేసుపై రాష్ట్ర, జాతీయ స్థాయి మీడియాల్లో విపరీతమైన ప్రచారం జరగడంతో లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో నలుగురు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు పైలట్ రోహిత్‌రెడ్డి, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు, హర్షవర్దన్ రెడ్డిని కొనుగోలు చేసేందుకు బిజేపి దళారులు రామచంద్రభారతి, కొరే నందకుమార్, సింహయాజి ప్రయత్నించి పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ముగ్గురు నిందితులపై తాండూర్ ఎంఎల్‌ఏ పైలట్ రోహిత్‌రెడ్డి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేశారు. ఈ కేసుపై విచారణను హైకోర్టు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.

అత్యధిక ప్రాధాన్యత కేసుః మహేందర్ రెడ్డి, డిజిపి

ఎంఎల్‌ఏల కొనుగోలు కేసు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నందున ఆరుగురు పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేశామని డిజిపి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆరుగురు సభ్యులలో నలుగురు ఐపిఎస్ అధికారులు ఉన్నారని, వారు నిజాలు నిగ్గు తేల్చుతారని తెలిపారు. సీనియర్ ఐపిఎస్ అధికారులను కేసు విచారణ కోసం నియమించామని తెలిపారు.

ఎంఎల్‌ఏల కొనుగోలు నిందితుల కస్టడీ…

ఎంఎల్‌ఏల కొనుగోలు విషయంలో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, సింహయాజులు, నందకిషోర్‌ను రెండు రోజుల పోలీసుల కస్టడీకి ఇస్తూ ఎసిబి కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు నిందితులను న్యాయవాదుల సమక్షంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయాలని ఆదేశించారు. చంచల్‌గూడ జైలులో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకోనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News